సమీక్ష : గ్రీన్ సిగ్నల్ – ప్రతి చోట ఆగడమే

సమీక్ష : గ్రీన్ సిగ్నల్ – ప్రతి చోట ఆగడమే

Published on May 30, 2014 8:55 PM IST
Green-Signal-(1) విడుదల తేదీ : 30 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : విజయ్ మద్దాల
నిర్మాత : రుద్రపాటి రమణరావు
సంగీతం : జేబీ
నటీనటులు : రేవంత్, గోపాల్ సాయి, అశుతోష్, రక్షిత, మానస్, శిల్పి శర్మ, డింపుల్, మనాలి రాథోడ్

ఈ మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు బాగా వస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం తక్కువ బడ్జెట్ తో గ్రీన్ సిగ్నల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త నటీనటులు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ చిత్రానికి, విజయ్ మద్దాల దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

బాచిలర్ లైఫ్ ను ఎంతో సంతోషంగా నలుగురు మిత్రులు ఎంజాయ్ చేస్తూ అనుకోకుండా ప్రేమలో పడతారు. నలుగురి లో ప్రతి ఒక్కరు కూడా తమతమ గర్ల్ ఫ్రెండ్స్ ను కలుసుకుంటారు. ఆ తరువాత నలుగురు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో డేటింగ్ లో ఉండి తమ జీవితాలను గడుపుతుంటారు. అయితే నలుగురు యువకుల జీవితాల లోకి వారి గర్ల్ ఫ్రెండ్స్ వచ్చిన తరువాత తమ ప్రేమతో వారి జీవితాలు సుఖాంతం అయ్యిందా ? లేక సమస్యల్లో చిక్కుకుందా ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలోని ప్రధాన నటీనటులు అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. రేవంత్ చాలా బాగా నటించాడు. రక్షిత చాలా ముద్దుగాబొద్దుగా కనిపించి తన పాత్రకు తగిన న్యాయం చేసింది. మానస్ బాగానే ఉన్నప్పటికీ, మరికొంత బాగా నటించాల్సి ఉంది. అతను చాలా తెలివిగా తన చిత్రాలను ఎంచుకోవాల్సి ఉంది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.

కథ మొత్తం చాలా బాగా అనిపించింది. నలుగురి మిత్రులు కథ ను తగ్గించటం తో పాటు, సన్యాసి కూడా చాలా హాస్యాన్ని పంచారు. ఈ చిత్రం లోని గ్లామర్, పాటలను చాలా బాగా తీశారు. సినిమా లోని కొన్ని హాస్య సన్నివేశాలు, చిత్రంలోని మొదటి పది నిముషాలు చాలా ఆసక్తిగా అనిపించింది.

మైనస్ పాయింట్స్:

హిందీ సూపర్ హిట్ చిత్రం ప్యార్ కా పంచ్ నామా చిత్రాన్ని రిమేక్ గా గ్రీన్ సిగ్నల్ ను నిర్మించారు. దిల్ తో బచ్చా హైజి చిత్రంలోని ఇమ్రాన్ హస్మి ఎపిసోడ్ ను ఈ చిత్రంలో మరో కథాంశంగా తీసుకున్నారు. దర్శకుడు హిందీ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నప్పటికీ దానిని పూర్తిస్దాయిలో ఎక్జిక్యూట్ చెయ్యలేక పోయారు. హిందీ చిత్రంలో ఉన్న కామెడీ ఈ చిత్రంలో కనిపించలేదు. ఈ చిత్రం చూసే వారు తరువాత ఏం జరగబోతోంది అనేది ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. ఒక్కరి పాత్ర కూడా మదిలో నిలిచిపోదు. జబర్దస్త్ ఫేం చమ్మక్ చంద్ర చేసిన గే కామెడీ ప్రేక్షకులకు నిద్ర వచ్చేలా చేస్తుంది. డబల్ మీనింగ్ కామెడీని ఈ చిత్రం నుంచి తొలగించాల్సింది.

సాంకేతిక విభాగం:

ఈ చిత్రానికి జేబీ చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. అయితే రెండు పాటలు చిత్రానికి సంబంధం లేకుండా ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది. చిత్రంలో క్లబ్ సాంగ్ చాలా బాగా తీశారు. విజువల్స్ ఎఫెక్ట్స్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం బాగుండాల్సి ఉంది.

దర్శకుడు మంచి కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ దానిని సరిగా తీయలేక పోయాడు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో కామెడీ యాంగిల్ లేదు. చిత్రంలోని అన్ని పాత్రలు సక్రమంగా ఉన్నప్పటికీ, చివరకు వచ్చేసరికి మెప్పించలేకపోయింది. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.

తీర్పు:

మొత్తం మీద మంచి నవ్వించే కామెడీ ని కథాంశంగా తీసుకున్నప్పటికీ, తగ్గించిన కథతో డైరెక్టర్ అసలు కథను సరిగా తీయలేకపోయాడు. ఒరిజినల్ హిందీ చిత్రాన్ని చూడని వారు, ఖాళీగా ఉండేవారు ఈ చిత్రానికి వెళ్ళవచ్చు.

 

123తెలుగు.కామ్ రేటింగ్: 2.5/5

123 తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

తాజా వార్తలు