ఓటిటి రివ్యూ : రకుల్ ప్రీత్ “సర్దార్ కా గ్రాండ్ సన్” – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి రివ్యూ : రకుల్ ప్రీత్ “సర్దార్ కా గ్రాండ్ సన్” – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

Published on May 19, 2021 2:02 AM IST
Sardar Ka Grandson- Hindi  movie review

విడుదల తేదీ : మే 18,2021

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, నీనా గుప్తా, అదితి రావు హైదరి, జాన్ అబ్రహం

దర్శకుడు : కాశ్వి నైర్

నిర్మాతలు : జాన్ అబ్రహం, మోనిషా అద్వానీ, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్

సంగీతం : తనిష్క్ బాగ్చి

సినిమాటోగ్రఫీ : మహేంద్ర శెట్టి

ఎడిటింగ్ : మాహిర్ జావేరి

మళ్ళీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చిత్రాలు నేరుగా ఓటిటిలోకే విడుదల అవుతున్నాయి. అలా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “సర్దార్ కా గ్రాండ్ సన్” దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక ఈ చిత్రం కథలోకి వెళ్లినట్టయితే రాధా(రకుల్ ప్రీత్) మరియు తన బాయ్ ఫ్రెండ్ అమ్రీక్(అర్జున్ కపూర్) లు కలిసి యూఎస్ లో ఉంటారు. కానీ అనుకోని విధంగా ఇండియాలో ఉన్న అమ్రీక్ బామ్మ సర్దార్(నీనా గుప్తా) ఆరోగ్యం బాగా లేదని కాల్ రాగ తాను ఇండియా వస్తాడు. తీరా అక్కడికి వచ్చాక అమ్రీక్ బామ్మ తన నుంచి ఒక మాట తీసుకుంటుంది. దానితో అమ్రీక్ జీవితంలో ఎలాంటి మలుపు తిరిగింది? ఆమె తీసుకున్న మాట ఏంటి అన్నవి తెలియాలి అంటే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెయిన్ లీడ్ అర్జున్ కపూర్ అయినా అతని పాత్రను మించిన స్కోప్ అతని బామ్మగా చేసిన నీనా గుప్త పాత్రకు కనిపిస్తుంది. 90 ఏళ్ల బామ్మగా నీనా క్లీన్ పెర్ఫామెన్స్ ను కనబర్చారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో పండించిన ఎమోషన్స్ స్పెషల్ మెన్షన్ ని చెప్పొచ్చు.

అలాగే అర్జున్ కపూర్ రోల్ మరీ తక్కువ అనేం కాదు తన రోల్ వరకు తాను కూడా మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో అయితే అర్జున్ నుంచి మంచి ఎమోషనల్ నటన చూడొచ్చు. వీరితో పాటుగా చాలా కాలం తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో కనిపించిన రకుల్ ప్రీత్ తన సపోర్టింగ్ రోల్ లో తన పాత్ర పరిధి మేరకు బాగా నటించడమే కాకుండా లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది.

వీరితో పాటుగా జాన్ అబ్రహం, అదిరిరావు హైదరిలు తక్కువ స్పేస్ తమ రోల్స్ కు న్యాయం చేకూర్చారు. అలాగే ఈ చిత్రంలో మంచి ఎమోషన్స్, డైలాగ్స్ చాలా టచ్చింగ్ గా అనిపిస్తాయి. సెకండాఫ్ లో ఎక్కువగా కనిపించే ఈ ఫ్యామిలీ డ్రామా ప్లెజెంట్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ కి వస్తే ఈ చిత్రం తాలూకా ఎమోషనల్ స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని డెవలప్ చేసిన విధానంలో చాలానే మిస్టేక్స్ కనిపిస్తాయి. అలాగే పాకిస్తాన్ సెటప్ అక్కడ కొన్ని సీన్స్ అనవసరంగాను ఒకింత ఓవర్ గాను అనిపిస్తాయి.

అలాగే అక్కడక్కడా కనిపించే కామెడీ ఎపిసోడ్స్ కూడా అంత ఫన్ ను జెనరేట్ చెయ్యవు. వీటితో పాటుగా చాలా చోట్ల లాజిక్కులు మిస్సయ్యాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ లాంటి దేశాల మధ్య కొన్ని సన్నివేశాలు వాటిని సింపుల్ గా అర్జున్ కపూర్ రోల్ హ్యాండిల్ చేసేసిన విధానం కాస్త సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ప్రతీ వర్గంలో ఉన్నతంగా కనిపిస్తాయి. బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలాగే సినెమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు ఇవ్వొచ్చు. పంజాబ్ సహా లాహోర్ తదితర ప్రాంతాల్లో లొకేషన్స్ విజువల్స్ బాగుంటాయి.

అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదని చెప్పొచ్చు. ఇక దర్శకుడు కాశ్వీ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ కథనాలు పర్వాలేదు అనిపించినా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే లాజిక్స్ పరంగా కూడా మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగున్ను.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ లో బ్యూటిఫుల్ ఎమోషన్స్ సెకండాఫ్ లో అర్జున్ కపూర్ మరియు నీనా సింగ్ ల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు ప్లెజెంట్ గా ఆకట్టుకుంటాయి. కాకపోతే పలు చోట్ల సాగదీత, లాజిక్ లేని కొన్ని అనవసర సన్నివేశాలు సహా వర్కౌట్ అవ్వని కామెడీ బోర్ అనిపిస్తాయి. లైట్ గా ఇవి పక్కన పెడితే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే సినిమా చూసే వారు అయితే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు