సమీక్ష : “సర్దార్” – ఇంట్రెస్ట్ గా సాగే ఎమోషనల్ స్పై డ్రామా !

సమీక్ష : “సర్దార్” – ఇంట్రెస్ట్ గా సాగే ఎమోషనల్ స్పై డ్రామా !

Published on Oct 22, 2022 3:04 AM IST
Sardar Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: కార్తి, రాశిఖన్నా, రజిషా, చుంకీ పాండే, లైలా తదితరులు

దర్శకత్వం : పీఎస్ మిత్రన్

నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్

సంగీతం: జీవి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: జార్జ్ విలయమ్స్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

 

కార్తి హీరోగా రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ సర్ధార్. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

విజయ్ (కార్తి ) ఒక పోలీస్. గుర్తింపు కోసం తానే చేసే ప్రతి పనిలో ఆవకాశం వెతుక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్ (కార్తి) కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వెళ్తుంది. మరో పక్క లాయర్ షాలిని (రాశిఖన్నా) ని విజయ్ (కార్తి) చిన్న తనం నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కథ ఇలా సాగుతూ ఉండగా.. ఇండియాలో ‘వన్ లైన్ వన్ పైప్’ అనే వాటర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతూ ఉంటాయి. మాజీ ‘రా’ ఆఫీసర్స్ ఇద్దరు ఈ వాటర్ ప్రాజెక్టును ఆపాలని.. దానికి సమర్ధుడు ఒక్క సర్దార్ (కార్తి) మాత్రమే అని అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతకీ ఈ సర్దార్ ఎవరు ?, అసలు ఈ వన్ లైన్ వన్ పైప్ వాటర్ ప్రాజెక్టు ఏమిటి ?, అలాగే విజయ్ కి – సర్దార్ కి మధ్య కనెక్షన్ ఏమిటి ?, చివరకు సర్దార్ ఈ వాటర్ ప్రాజెక్టును ఏం చేశాడు ?, అలాగే విజయ్ (కార్తి ) మిషన్‌లో ఎలా భాగమయ్యాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

కార్తి తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ సినిమాలోని రెండు పాత్రల్లో నటించాడు. పైగా సర్దార్ పాత్రకి – విజయ్ పాత్రకి ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా కార్తి చాలా వైవిధ్యంగా నటించి మెప్పించాడు. తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కార్తి కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ రాశి ఖన్నాతో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని కార్తి చాలా సెటిల్డ్ గా చక్కగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ చుంకీ పాండే, లైలా పాత్రలు. తల్లి పాత్రలో కనిపించిన లైలా తన నటనతో మెప్పించింది. చుంకీ పాండే విషయానికి వస్తే.. ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ రజిషా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు మిత్రన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే హై టెక్నికల్ వేల్యూస్‌ తో ఈ చిత్రం తెరకెక్కింది.

 

మైనస్ పాయింట్స్ :

సర్దార్ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ చాలా బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. దీనికితోడు దర్శకుడు పీఎస్ మిత్రన్ సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

మంచి కథను రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు పీఎస్ మిత్రన్. ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే, సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకుడుజీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. అలాగే ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. జార్జ్ విలయమ్స్ సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

సర్ధార్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ స్పై డ్రామాలో.. అద్భుతమైన యాక్షన్ అండ్ లవ్లీ లవ్ సీన్స్, మరియు కొన్ని డెప్త్ ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల స్లో గా ఉంది. అయితే సినిమాలో కార్తి యాక్టింగ్ అండ్ మెయిన్ కంటెంట్ హైలైట్ గా ఉంది. ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు