సమీక్ష : “స్లమ్ డాగ్ హస్బెండ్” – కొన్ని నవ్వులకి మాత్రమే

సమీక్ష : “స్లమ్ డాగ్ హస్బెండ్” – కొన్ని నవ్వులకి మాత్రమే

Published on Jul 30, 2023 3:01 AM IST
Slum Dog Husband Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సంజయ్ రావ్, ప్రణవి మనుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, మురళీధర్ గౌడ్

దర్శకుడు : ఏఆర్ శ్రీధర్

నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి

ఎడిటర్: ఎ వైష్ణవ్ వాసు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి కేవలం రెండు చిత్రాలే రాగా వాటిలో “బ్రో” నిన్ననే రిలీజ్ కాగా ఈరోజు రిలీజ్ కి వచ్చిన చిత్రమే “స్లమ్ డాగ్ హస్బెండ్”. మరియు యంగ్ హీరో సంజయ్ ఆర్ రావ్ హీరోగా నటించిన ఏఈ చిత్రం డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..లచ్చిగా పిలవబడే లక్ష్మణ్(సంజయ్ ఆర్ రావ్) అలాగే మౌనిక(ప్రణవి మానుకొండ) ఇద్దరు గాఢమైన ప్రేమలో ఉండగా తాము తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ అనుకోకుండా ఈ ఇద్దరికీ పెళ్లి కావాలంటే మొదటగా లచ్చి తన జాతకంలో దోషాల ప్రకారం ఓ శునకాన్ని(కుక్క) పెళ్లి చేసుకోవాలి అని పంతులు చెప్తారు. మరి దీనినే నమ్మిన లచ్చి మౌనిక కంటే ముందు ఆ శునకంని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే తర్వాత ఊహించని విధంగా లచ్చి పై ఓ లీగల్ కేసు ఫైల్ అవుతుంది. మరి తనపై అసలు ఆ కేస్ వేసింది ఎవరు? ఇంతకీ లక్ష్మణ్, మౌనికలు పెళ్లి చేసుకుంటారా లేదా? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మన టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ తన మొదటి సినిమా “ఓ పిట్ట కథ” తోనే మంచి నటన కనబర్చి ఆకట్టుకున్నాడు. అయితే ఈ చిత్రంలో మాత్రం తనకి మరింత ప్రూవ్ చేసుకునే స్కోప్ దక్కింది అని చెప్పాలి.

అలాగే తన స్టోరీ సెలక్షన్ కూడా బాగుంది అని ఈ సినిమాకి కూడా చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్ లో తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ అయితే చాలా బావుంది. ఇక నటి ప్రణవి మనుకొండ మంచి నటనను సహా తన లుక్స్ తో కూడా ఈ చిత్రంలో ఆకట్టుకుంది.

ఇక సినిమాలో కామెడీ పరంగా నటుడు యాదమ్మ రాజు పై సన్నివేశాలు మంచి ఇంట్రెస్టింగ్ గా హిలేరియస్ గా సాగుతాయి. ఇంకా వీరితో పాటుగా సినిమాలో మిగతా కొందరు నటులు లీడ్ ఇంకా ఆ కుక్క కూడా బాగా నటించింది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ దానిని అయితే దర్శకుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆసక్తిగా అయితే నడపలేదు. మరికాస్త ఏన్గెకింగ్ స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో ఉండి ఉంటే బాగుండేది. అలాగే ఎమోషన్స్ పరంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

పలు సీన్స్ ఇంకా బలంగా ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉంది కానీ చాలా వరకు సినిమా చాలా సింపుల్ గానే అనిపిస్తాయి. ఇక క్యాస్టింగ్ లో బ్రహ్మాజీ, సప్తగిరి లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వారిని కూడా సరిగ్గా వినియోగించుకోలేదు అనిపిస్తుంది.

అలాగే ఈ చిత్రంలో కొన్ని సెన్సిటివ్ అంశాలని కూడా మేకర్స్ టచ్ చేసే ప్రయత్నం చేసారు కానీ దానిని ఇంకా అర్ధవంతంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల పలు సీన్స్ అలా నెమ్మదిగా బోర్ ఫీల్ తెప్పిస్తాయి. మరి ఇలాంటి వాటితో అయితే ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ గా అనిపించదు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కంటెంట్ కి తగ్గట్టుగా క్రియేట్ చేసిన వాతావరణం బాగుంది. ఇక టెక్నీకల్ టీం లో భీమ్స్ ఈ చిత్రానికి అంత ఆకట్టుకునే స్థాయి సంగీతాన్ని అయితే ఇవ్వలేదు ఒక్క పాట మినహా మిగతా అంతా సో సో గానే ఉంది. అలాగే శ్రీనివాస్ జె రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు ఏ ఆర్ శ్రీధర్ విషయానికి వస్తే..తాను మంచి థీమ్ ని ఎంచుకున్నాడు కానీ దీనిని ఇంకా బెటర్ స్క్రీన్ ప్లే రాసుకొని ప్రెజెంట్ చేసి ఉంటే తాను తీసుకున్న కంటెంట్ కి పూర్తి స్థాయి న్యాయం చేసినవాడు అయ్యేవాడు. కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు కానీ మిగతా సినిమా అంతా సో సో గానే అనిపిస్తుంది. వీటితో తన వర్క్ కేవలం యావరేజ్ గానే అనిపిస్తుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “స్లమ్ డాగ్ హస్బెండ్” తో యంగ్ హీరో సంజయ్ నటుడుగా మరింత పరిణితి చెందాడు అని చెప్పవచ్చు అలాగే హీరోయిన్ కూడా డీసెంట్ డెబ్యూతో ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో కంటెంట్ బాగానే ఉంది కానీ ఇంకా బెటర్ నరేషన్ డిజైన్ చేయాల్సింది. వీటితో కొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ వరకు ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు