సమీక్ష : సోదర సోదరీమణులారా – స్లో గా సాగే బోరింగ్ డ్రామా

సమీక్ష : సోదర సోదరీమణులారా – స్లో గా సాగే బోరింగ్ డ్రామా

Published on Sep 15, 2023 7:19 PM IST
Mark Antony Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణా దేవి, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు

దర్శకుడు : రఘుపతి రెడ్డి గుండా

నిర్మాత: : విజయ్ కుమార్ పైండ్ల

సంగీతం: వర్ధన్

సినిమాటోగ్రఫీ: మోహన్ చారి

ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి

సంబంధిత లింక్స్: ట్రైలర్

డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండా దర్శకత్వంలో కమల్ కామరాజు నటించిన చిన్న సినిమా సోదర సోదరీమణులారా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

రాజు (కమల్ కామరాజు) జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక క్యాబ్ డ్రైవర్. ఒక రోజు, అతను ఒక రిమోట్ పబ్ నుండి బాగా మత్తులో ఉన్న స్త్రీని పిక్ చేసుకుంటాడు. కానీ ఆమె రైడ్ సమయంలో చనిపోయింది. రాజు ప్రమేయం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చనిపోయిన మహిళ ఎవరు? ఆమె మృతికి, రాజుకు ఏమైనా సంబంధం ఉందా? ఈ మృతికి సంబందించిన రహస్యాలు మరియు రాజు యొక్క ఫేట్ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

కమల్ కామరాజు క్యాబ్ డ్రైవర్ పాత్రలో చాలా బాగా నటించాడు. చక్కని నటన కనబరిచి, ఆకట్టుకున్నాడు.

బాహుబలిలో కాలకేయ పాత్రతో పాపులర్ అయిన ప్రభాకర్, ఈ సినిమాలో అత్యాశగల, క్రూరమైన పోలీస్‌గా మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించాడు.

అపర్ణా దేవి, పృథ్వీ, పద్మారావు మరియు సునీత మనోహర్‌లతో సహా మిగిలిన ఇతర నటీనటులు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడి చెప్పాలనుకున్న విషయాన్ని, తెరపై అంత చక్కగా చూపించలేకపోయారు. ఎగ్జిక్యూషన్ అంతగా ఆకట్టుకోదు. డ్రాగ్ మరియు అన్‌ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కారణం గా బోరింగ్ గా అనిపిస్తుంది.

అపర్ణా దేవి పాత్ర, తన భర్త కోసం పోరాడడంలో ఆమె పోరాటాన్ని చిత్రీకరించడానికి ఇంకా బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా పృథ్వీ రాజ్ పాత్ర అంత ఎఫెక్టివ్ గా లేదు.

కాలకేయ ప్రభాకర్ పాత్ర పర్వాలేదు. అయితే కథాంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఇంకా బెటర్ గా డిజైన్ చేయవచ్చు.

సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. దానికి మించి ఎక్కువ రన్ టైమ్ మైనస్ అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

డెబ్యూ డైరెక్టర్ రఘుపతి రెడ్డి రైటింగ్ మరియు డైరెక్షన్ రెండింటితో అంతగా ఆకట్టుకోలేదు. ప్రేక్షకులను ఎఫెక్టివ్‌గా ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు.

సంగీతం, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాలా బాగా చేసే అవకాశం ఉంది. ఈ అంశాలు సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి దోహదపడే అవకాశం ఉన్నా, అంతగా ఆకట్టుకోలేదు.

 

తీర్పు:

మొత్తం మీద, సోదర సోదరీమణులారా చిత్రం బలహీనమైన మరియు ఆకట్టుకోని స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచింది. కమల్ కామరాజు నటన ప్రత్యేకంగా ఉంది. అతని నటన గురించి కాకుండా, సినిమా గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు