సమీక్ష : ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ – ప్రెజెంటేషన్ మిస్సింగ్

సమీక్ష : ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ – ప్రెజెంటేషన్ మిస్సింగ్

Published on May 13, 2023 12:00 AM IST
Custody Movie Review In Telugu

విడుదల తేదీ : మే 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: నిహాల్ కోధాటి, దృషికా చందర్, మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్, దేవి నాగవల్లి, మెహర్ శ్రీరామ్ తదితరులు.

దర్శకులు : రవిప్రకాష్ బోడపాటి

నిర్మాతలు: ప్రసాద్ తిరువళ్లూరి, పుష్యమి డౌలేశ్వరపు

సంగీత దర్శకులు: ఆర్వీజ్

సినిమాటోగ్రఫీ: అమరదీప్ గుత్తుల

ఎడిటర్:ప్రవీణ్ పూడి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన సరికొత్త సినిమా ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యొక్క కథ, కథనాలు, పూర్తి సమీక్ష ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

చరిత్ర (దృషిక చందర్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాయిస్ ఆర్టిస్ట్, ఆమె కష్టపడి మరింతగా ఎదుగుతుంది. ఆమెకు రవి (నిహాల్ కోధాటి) అనే స్నేహితుడు ఉంటాడు, అతను ఎల్‌ఐసి ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు. ఒక రోజు విక్రమ్ (సమర్త్ యుగ్) అనే వ్యాపారవేత్తతో కలిసి డిన్నర్ చేసిన తర్వాత చరిత్ర తప్పిపోతుంది. చరిత్ర మిస్సింగ్‌పై పోలీస్ డిపార్ట్‌మెంట్ రవి మరియు విక్రమ్‌ ఇద్దరినీ అనుమానిస్తుంది. మరి నిజానికి చరిత్ర ఎందుకు మిస్ అయింది. అసలు ఆమెకు ఏమి జరిగింది. అసలు విక్రమ్ ఎవరు, చరిత్ర మిస్సింగ్ వెనుక విక్రమ్, రవి లలో ఎవరున్నారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నటి దృషికా చందర్ తన పాత్రలో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయి నటించడంతో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆమె ఇబ్బంది పడుతూ హిందీ మాట్లాడే డైలాగ్స్ ఫన్నీ గా ఉండడంతో పాటు పలు యక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆమె బాగా పెర్ఫార్మ్ చేసింది. నిహాల్ కోధాటి పెర్ఫార్మన్స్ బాగుండడంతో పాటు ఫిమేల్ లీడ్ తో ఆయనకు ఉన్న సీన్స్ బాగున్నాయి. ముఖ్య పాత్రల యొక్క పెర్ఫార్మన్స్ లతో ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది. మిస్సింగ్ కేసును విచారించే అధికారిగా భార్గవ పొలిదాసు సెటిల్ పర్‌ఫార్మెన్స్ అందించారు. అలానే సినిమాలో ఒకట్రెండు పాటలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకున్న మేకర్స్ దానిని ఆకట్టుకునేలా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేయడంలో మాత్రం విఫలం అయ్యారు అనే చెప్పాలి. కొన్ని అనవసర సన్నివేశాలు సినిమా పై కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. మంచి కథ, కథనాలు ఎంచుకున్న మేకర్స్ పక్కాగా ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే, ఆడియన్స్ కి దానిని కనెక్ట్ చేయడంలో ప్రెజెంటేషన్ బాగా రాసుకుని ఉంటె తప్పకుండా మూవీ ఆకట్టుకునేది. సెకండాఫ్ మొత్తం భరించలేని గందరగోళంగా సాగుతుంది. పలు సీన్స్ లో మెయిన్ పాయింట్ కి సంబంధం లేని సీన్స్ ఎందుకు వచ్చాయో కూడా అర్ధం కాదు. అయితే వారు తీసుకున్న మెయిన్ పాయింట్ ని క్లైమాక్స్ సమయంలో మాత్రమే ప్రెజెంట్ చేసారు, కాగా అప్పటికే ఆడియన్స్ మూవీ పై విసుగు చెందుతారు. సెకండ్ హాఫ్ లో ఆ క్లైమాక్స్ సీన్స్ మాత్రమే బాగుంటాయి. మిగతా భాగం మొత్తం కూడా ఎంతో డల్ గా సాగుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్ పోర్షన్ కూడా ఆకట్టుకోదు. అందులో క్లారిటీ కూడా ఉండదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని అనవసరమైన సీన్స్ ని ఎడిటింగ్ విభాగం వారు ట్రిమ్ చేస్తే బాగుండేది. అనవసరమైన సన్నివేశాలను తొలగిస్తూ దర్శకుడు తన పాయింట్‌ని సరైన రీతిలో తెలియజేసి ఉంటే మొత్తం ప్రభావం మరింత మెరుగ్గా ఉండేది. నాగవల్లి పాత్రలో కూడా డెప్త్ మిస్ అయిందనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఆర్వీజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో బాగున్నాయి. అమరదీప్ ఫోటోగ్రఫి బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ విభాగం మరింత బాగా పనిచేస్తే బాగుండేది. ఇక డైరెక్టర్ రవి ప్రకాష్ బోడపాటి విషయానికి వస్తే, ఆయన పెర్ఫార్మన్స్ డిజప్పాయింట్ చేస్తుంది. ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ఎంగేజింగ్ గా తీయడంలో విఫలం అయ్యారు. మంచి కథనం, స్క్రీన్ ప్లే రాసుకుంటే తప్పకుండా మూవీ బాగా సక్సెస్ అయి ఉండేది.

 

తీర్పు :

మొత్తంగా ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మూవీలో మంచి పాయింట్ ఉన్నపటికీ ఆకట్టుకునే గ్రిప్పింగ్ కథనం లేకపోవడంతో నిరాశపరుస్తుంది. నిహాల్ కోధాటి, దృషికా చందర్ ఇద్దరూ తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. మేకర్ ఉద్దేశం ప్రశంసనీయం, కానీ దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి మరింత కృషి చేయాల్సింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు