Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : తుంటరి – టైమ్ పాస్ ఎంటర్టైనర్

Tuntari review

విడుదల తేదీ : 11 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : కుమార్ నాగేంద్ర

నిర్మాత : అశోక్, నాగార్జున

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : నారా రోహిత్, లత హెగ్డే

‘బాణం’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘రౌడీ ఫెలో’, ‘అసుర’ లాంటి వరుస హిట్లు కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. తాజాగా నారా రోహిత్ నటించిన సినిమా ‘తుంటరి’. మంచి స్థాయిలో ప్రమోషన్లు చేయడంతో ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..

కథ :

కొంతమంది కార్పోరేట్ ఉద్యోగులు సెలవులకు ఓ హిల్ స్టేషన్ కు వెళతారు. అక్కడ వాళ్లకు ఓ సన్యాసి కనిపించి తనకు భవిష్యత్తు తెలుసనీ చెబుతాడు. ఆ విషయాన్ని నమ్మించడానికి వాళ్లకు నాలుగు నెలల తరువాత రాబోయే న్యూస్ పేపర్ ను ఇస్తాడు. ఆ పేపర్ ను చదివిన వాళ్ళకు రాజు(రోహిత్) అనే వ్యక్తి ద్వారా వాళ్ళు బాక్సింగ్ పోటీల్లో నెగ్గి 5కోట్లు గెలుచుకుంటారని తెలుస్తుంది.

దీంతో రాజును వెతుక్కుంటూ వెళ్ళిన ఆ ఉద్యోగులు చివరికి అతన్ని వైజాగ్ లో కనుక్కుని అతన్ని బాక్సింగ్ పోటీలకు ఒప్పిస్తారు. మొదట్లో అల్లరి చిల్లరిగా తిరిగే రాజు ఎలా బాక్సింగ్ పోటీలకు ఒప్పుకుంటాడు? అసలు బాక్సింగే రాని అతను ఆ పోటీని ఎలా గెలుస్తాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ బాగుండి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తుంది. ఒక కల్పిత కథను నిజ జీవితానికి కనెక్ట్ చేసి చెప్పిన విధానం బాగుంది. కథలోని అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడి పాత్రలో నారా రోహిత్ నటన అద్భుతంగా ఉంది. బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో రోహిత్ నవ్వించిన విధానం సినిమా మొత్తానికి మేజర్ హైలెట్ అని చెప్పుకోవచ్చు.

సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగా సాగిపోతుంది. వెన్నెల కిషోర్, షకలక శంకర్ తమదైన కామెడీని పండించారు. హీరోయిన్ లతా హెగ్డే తన మొదటి సినిమాలో తన పరిధికి తగ్గట్టు బాగానే నటించింది. ఇక ప్రతినాయకుడు కబీర్ సింగ్ దుహ పాత్ర అంత పెద్దది కాకపోయినప్పటికీ క్లైమాక్స్ లో తన నటనతో మెప్పించాడు. సినిమాలోని ఆఖరి 20 నిముషాల బాక్సింగ్ సీక్వెన్స్ బాగా పండింది. కామెడీ రెఫరీగా అలీ కామెడీ కొంతవరకూ వర్కవుటైంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ పాయింట్ పాటలు. 2 గంటల 4 నిముషాల నిడివి ఉన్న ఈ సినిమాలో వచ్చే 5 పాటలు సినిమా ఫ్లో ని దెబ్బతీస్తాయి. సినిమాకి మరో డ్రా బ్యాక్ సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ సినిమా క్లైమాక్స్ వరకూ ఎలాంటి లక్ష్యమూ లేకుండా సాగదీసినట్టు వెళుతూ బోర్ కొట్టిస్తుంది.

ప్రధానంగా హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన రొమాంటిక్ కెమిస్ట్రీ అనేది ఎక్కడా కనిపించదు. దీంతో సెకండ్ హాఫ్ బోరింగా అనిపిస్తుంది. పైగా క్లైమాక్స్ లో వచ్చే బాక్సింగ్ సన్నివేశాలు బాగానే ఉన్నా అంత సీరియస్ మోడ్ లో కాస్త కామెడీగా, సాగదీసినట్టుగానూ ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. వైజాగ్, దాని పరిసర ప్రాంతాలను సినిమాటోగ్రాఫర్ అందంగా చూపించాడు. ఎడిటింగ్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. డైలాగులు ఫన్నీగా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ ఫర్వాలేదనిపించింది.

ఇక కుమార్ నాగేంద్ర దర్శకత్వ విషయానికొస్తే రీమేక్ సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు. మంచి కామెడీతో ఫస్ట్ హాఫ్ ను చెప్పిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని నియమాలను విస్మరించినప్పటికీ క్లైమాక్స్ లో బాగానే మేనేజ్ చేశాడు. తనకు ఉన్న అన్ని సౌకర్యాలను సినిమా తీయడం కోసం బాగానే వాడుకున్నాడు.

తీర్పు :

ఎప్పుడూ కాస్త సీరియస్ పాత్రలను ఎంచుకునే నారా రోహిత్, మొదటిసారి ఎంటర్టైనింగ్ పాత్రను ఎంచుకుని ఆ పాత్రలోనూ మెప్పించగలనని తుంటరి సినిమాతో ఋజువు చేశాడు. నారా రోహిత్ నటన, ఎంటర్‌టైనింగ్ ఫస్టాఫ్, ఒక ఫాంటసీ ఎలిమెంట్‌ను ఎంటర్‌టైనింగ్ కథకు లింక్ చేయడం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌లో కథ మందగించడం, విసుగు పుట్టించే పాటలను మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వీకెండ్‌కి సరదాగా కాసేపు టైమ్‌పాస్ కోసం ఈ సినిమా చూడొచ్చు!

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :