చిట్ చాట్ : లగడపాటి శ్రీధర్ – ప్రేక్షకుల మనసు అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది.

చిట్ చాట్ : లగడపాటి శ్రీధర్ – ప్రేక్షకుల మనసు అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది.

Published on Sep 12, 2013 4:01 AM IST

Lagadapati-Sridhar
లగడపాటి శ్రీధర్ గతంలో నిర్మించిన సినిమా ‘ఎవడి గోల వాడిది’. ప్రస్తుతం తను నిర్మించిన సినిమా ‘పోటుగాడు’ విడుదలకు సిద్దంగా వుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. పవన్ వాడేయార్ దర్శకత్వం వహించాడు. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా వున్నాడు. ఆయన ఈ రోజు ప్రెస్ ఏర్పాటు చేసి కాసేపు ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడారు. ఆవివరాలు ఇప్పుడు మీకోసం.

ప్రశ్న: ‘పోటుగాడు’ ఎలా ఉంటుంది ?

స: ఇక్కడున్న అందరికి తెలుసు ఈ సినిమా కన్నడలో హిట్ అయిన సినిమాకి రీమేక్ గా నిర్మించమని. ఎప్పుడైతే ఆ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలైయ్యిందో అప్పుడే ఆ సినిమా పాట నా మనసును కదిలించేసింది. నేను అప్పుడే ఆ సినిమాని చూడాలని అనుకున్నాను. ఆ సినిమా డైరెక్టర్ క్రీయేటివిటికి, ఒరిజినాలిటిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తరువాత సినిమా విడుదలై చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే డైరెక్టర్ లో ఈ సినిమాని తెలుగులో తీయాలని నేను నిర్ణయించుకున్నాను.

ప్రశ్న: సినిమా గురించి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?

స : ” మంచి తో పాటు పంచ్ ఉన్న సినిమా ” ఈ రోజుల్లో ప్రేక్షకులు ఒకసారి చూసిన సినిమాని మరో సారి చూడరు. కానీ మా సినిమాని ప్రజలు ఒక్కసారి కాదు మళ్ళి మళ్ళి 3-4 సార్లు చూస్తారు. ఈ సినిమాకి అంతటి సామర్థ్యం వుంది.

ప్రశ్న: మీ బ్యానర్ లో వచ్చే సినిమాలకు సాదారణంగా ‘యు’ సర్టిఫికేట్ వస్తుంది? కానీ పోటుగాడుకి “ఎ” వచ్చింది? దాని ఉద్దేశ్యం ఏమిటి?

స : నేను సెన్సార్ బోర్డు గురించి ఏమి మాట్లాడను. కాని నేను ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చిందని ఏమి భాదపడటంలేదు. నా టార్గెట్ 18 – 30 సంవత్సరాల వయసుగల వారు ఈ సినిమా చూసి చాలా ఎంజోయ్ చేయాలి. ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా వున్నాయి. ఈ సినిమాలో నలుగురు అందమైన, అందరిని ఆకట్టుకునే హీరోయిన్స్ వున్నారు. సాదారణంగానే వారు చాలా గ్లామరస్ గా నటించారు. దాని వల్ల కాబోలు వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చి ఉండవచ్చు.

ప్రశ్న: మనోజ్ గురించి చెప్పండి ?

స : ఈ సినిమాతో మనోజ్ ‘కలెక్షన్ కింగ్’ అవుతాడు. తను చాలా ఉత్సాహంగా నటించే నటుడు. ” టాలెంట్ తో పాటు క్రియేటివిటీ కూడా ఉంది”. ఈ సినిమాకి సంబందించిన పాటలు మంచి హిట్ అయ్యాయి. ఈ క్రెడిట్ అంత మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చుకి చెందుతాయి. ఈ సినిమాలో మనోజ్ చాలా రిస్కీ స్టంట్స్ చేశాడు. ఈ సినిమా మనోజ్ సినిమా మాదిరిగానే వున్న ఈ సినిమాలో అతని పాత్రలో నాలుగు రకాల షేడ్స్ కనిపిస్తాయి.

ప్రశ్న:ఇది కన్నడ సినిమా. మరి తెలుగు వర్షన్ లో ఏమైనా మార్పులు చేశారా?

స : అవును. కొన్ని బాగాలను తెలుగు నెటివిటికి తగినట్టుగా మార్పులు చేయడం జరిగింది. సినిమా క్లైమాక్స్ కూడా మార్పు చేశాం. పోసాని పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుంది.

ప్రశ్న: ఈ సినిమాలో నలుగు హీరోయిన్స్ వున్నారు. వారు కేవలం గ్లామరస్ కోసమేనా లేకా సినిమాలో వారి పాత్రలకి ఏదైనా ప్రాదాన్యం ఉందా?

స: ఈ సినిమాలో చేసిన నలుగురు హీరోయిన్స్ ఈ సినిమాకు చాలా ముఖ్యం. అందరికి సమానమైన ప్రాదాన్యత ఉంటుంది. వారు అందరు మోడల్స్, మాజీ అందాల రాణులు.

ప్రశ్న: మీరు పప్రొడ్యూసర్ గా చాలా గ్యాప్ తీసుకున్నారు. ఏదైనా బలమైన కారణం వుందా?

స : మా బ్యానర్ కి మంచి ఇమేజ్ ప్రాదాన్యత వున్నాయి. మేము ఆ ఇమేజ్ ఎప్పటికి కాడలనుకుంటున్నాను. అలాగే నేను ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. వారిని విశ్లేషించి వారు ఏది కావాలనుకుంటున్నారో అంచనా వేయడానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.

ప్రశ్న: మీరు సినిమాని శుక్రవారం కాకుండా శనివారం ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు?

స : (నవ్వుతూ) శుక్రవారం 13 వతేదీ కి ఒక హిస్టరీ వుంది. మేము దానిని కావాలనుకోవడం లేదు. అంతేకాకుండా సిజి వర్క్ ని పూర్తి చేయడానికి, ప్రింట్ రెడీ కావడానికి మాకు ఇంకొక రోజు అవసరం అయ్యింది.

ప్రశ్న: ఎందుకు మీరు రిమేక్ చేయడానికి కన్నడ డైరెక్టర్ ని ఎంచుకున్నారు?

స : పవన్ వాడేయార్ చాలా వైవిధ్యమైన టాలెంట్ కలిగిన వ్యక్తి. ఆయన వయస్సు 25 సంవత్సరాలు. అతను ఇప్పటికే కన్నడలో రెండు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను అందించాడు. ఆయన క్రియేటివిటి నాకు సహాయం అవుతుందని అనుకున్నాను. మేము ఇద్దరం మరోసారి కూడా కలిసి పని చేయాలనీ అనుకుంటున్నాము.

ప్రశ్న; ఈ సినిమాపై మీకు ఎలాంటి అంచనాలు వున్నాయి?

స : ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని మేము బారీగా 800 థియేటర్స్ లో విడుదల చేయనున్నాము. దీనికి డిస్ట్రీబ్యూటర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా నాకు నచ్చిన అలాగే ప్రేక్షకులకు నచ్చిన సినిమా(నవ్వుతూ ). నేను కచ్చితంగా చెబుతున్నాను ఈ సినిమా విజయాన్ని సాదించిన తరువాత ఈ ‘పోటుగాడి’ పేరు అందరి నోట వస్తుంది. అని శ్రీదర్ ఈ సినిమా గురించి తెలియజేశాడు. ఈ సినిమాతో అతను ఒక ట్రెండ్ సెట్ చేసినవాడు అవుతాడా.

ఏది ఏమైన శ్రీధర్ లాగడపాటి తో మా చిట్ చాట్ ముగిసింది. ఈ యంగ్ నిర్మాతకి ‘పోటుగాడు’ సినిమా విజయాన్ని సాదించాలని కోరుకుంటున్నాం.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు