ఇంటర్వ్యూ : నాగార్జున – కార్పోరేట్ ఫిల్మ్ మేకింగ్ ఆహ్వానించదగినది..

ఇంటర్వ్యూ : నాగార్జున – కార్పోరేట్ ఫిల్మ్ మేకింగ్ ఆహ్వానించదగినది..

Published on Oct 24, 2013 4:15 AM IST

nagarjuna

‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ‘భాయ్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించాడు. ఈ సందర్భంగా ఈ హన్డ్సం హీరో ఈ రోజు మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సమావేశంలో ఆయన భాయ్ సినిమా గురించి, టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న కార్పోరేట్ సంస్థల గురించి మాతో చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘భాయ్’ గురించి మీరేమి చెబుతారు?

స) ‘భాయ్’ 100% పక్కా ఎంటర్టైనింగ్ మూవీ. కమర్షియల్ అంశాలు కలగలిపిన అల్ రౌండ్ ఎంటర్టైనర్. మంచి సాంగ్స్, మంచి యాక్షన్ సీక్వెన్స్ లు మరియు బాగా నవ్వుకోదగిన కామెడీ ఉన్న సినిమా ‘భాయ్’. సెకండాఫ్ మొదటి నుండి ఫ్రీ క్లైమాక్స్ వరకు హై రేంజ్ లో కామెడీ ఉంటుంది.

ప్రశ్న) మీరు ఈ సినిమాలో విభిన్న పాత్రల్లో కనిపించానున్నారా?

స) లేదు. కానీ నేను ఈ మూవీలో విభిన్న గెటప్స్ లో కనిపిస్తాను. మొదట్లో హాంగ్ కాంగ్ డాన్ లా కనిపిస్తాను. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో ఉండే హైదరాబాద్ దాదాలా కనిపిస్తాను. చివరి స్టేజ్ లో వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తాను.

ప్రశ్న) ఈ సినిమాకి ‘కింగ్’ కి ఏమన్నా పోలిక ఉందా?

స) లేదు, అస్సలు పోలికే లేదు. ఈ రెండింటిలో ఉన్న కామన్ విషయం ఏమిటంటే చాలా మంది కమెడియన్స్ మరియు చాలా మంది విలన్స్ ఉండడమే..

ప్రశ్న) ఈ సినిమాకి ‘భాయ్’ అనే టైటిల్ ని ఎందుకు ఎంచుకున్నారు?

స) వీరభద్రం ఎప్పుడైతే నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చాడో అప్పుడే ఈ టైటిల్ తో వచ్చాడు. ఈ మూవీకి ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ సినిమాలో ఒకవైపు మాఫియా ఎపిసోడ్స్ జరుగుతుంటే మరోవైపు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది.

ప్రశ్న) ఒక దర్శకుడిగా వీరభద్రం ఎలా అనిపించాడు?

స) వీరభద్రంతో పనిచెయ్యడం నాకొక మంచి అనుభవం. ఎంటర్టైన్మెంట్ మీద బాగా గ్రిప్ ఉన్న డైరెక్టర్. అలాగే మిగిలిన విషయాల్లో కూడా బాగా కేర్ తీసుకుంటాడు.

ప్రశ్న) మీ గత సినిమాల్లో లేని విధంగా ‘భాయ్’ సినిమాలో ఎక్కువగా పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. దానికి ఏదైనా రీజన్ ఉందా?

స) ప్రస్తుతం పంచ్ డైలాగ్స్ అంటే యువత బాగా మెచ్చుకుంటోంది, అలాగే అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. నాకు ఈ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే స్క్రిప్ట్ లో భాగంగా పంచ్ డైలాగ్స్, వన్ లైన్ డైలాగ్స్ ఉన్నాయి. కావున మేము అలానే ప్రొసీడ్ అయిపోయాం.

ప్రశ్న) మీరు ‘హలో బ్రదర్’, ‘అల్లరి అల్లుడు’ లాంటి మాస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ జోనర్ లో ఎందుకని ఎక్కువగా సినిమాలు చేయలేదు?

స) మీరన్నదానికి నేను ఒప్పుకుంటాను. నేను మాస్ కామెడీ ఎంటర్టైనర్స్ చేసి చాలా కాలం అయ్యింది. అదే ఈ సినిమా చెయ్యడానికి గల ప్రధాన కారణం. ఈ గ్యాప్ లో నేను కొన్ని ఫ్రెష్ కాన్సెప్ట్ లతో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శిరిడి సాయి’, ‘రాజన్న’ లాంటి పలు సినిమాలు చేసాను. నేను వచ్చిన కథలని బట్టి చేసుకుంటూ వెళ్లాను.

ప్రశ్న) మీరు ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలకు రిలయన్స్ వాళ్ళతో జత కలిసారు. ఈ డీల్ ఇలాగే కొనసాగుతుందా?

స) ప్రస్తుతానికైతే అది రెండు సినిమాల డీల్ మాత్రమే.. మేము వారి మెథడ్స్ ని ఇష్టపడాలి, వారు మాతో సౌకర్యంగా ఫీలవ్వాలి. ప్రస్తుతానికైతే మాకున్న రిలేషన్ తో ఇద్దరం హ్యాపీ గా ఉన్నాం. చూద్దాం ముందు ముందు ఎలా వెళుతుందో.. వాళ్ళు ‘అత్తారింటికి దారేది’ సినిమాతో సక్సెస్ రూట్ ని కనుగొన్నారు. ఇది మంచి మొదలే అనుకోవాలి(నవ్వులు).

ప్రశ్న) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థల ఎంట్రీ ఇక్కడ ఏమన్నా మార్పులు తెస్తుందా. మీరు దీన్ని స్వాగతిస్తారా?

స) అవును నేను స్వాగతిస్తాను. అనధికారికంగా ఒప్పందాల ద్వారా జరిగే బిజినెస్ ఎక్కువ రోజులు కొనసాగదు. ఎన్నో నియమాలతో అధికారిక ఒప్పందాలు చేసుకోవాలి. ఒప్పందాలు అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలి, అలాగే అనుకున్నదానికి కట్టుబడి ఉండాలి. అలాగే ఇది స్వాగతించదగిన మార్పే.. మీరు గమనించి నట్లయితే కార్పోరేట్ సంస్థలు వచ్చాకే బాలీవుడ్ సినిమాలు 100 కోట్ల క్లబ్ ని క్రాస్ చెయ్యడం మొదలైంది. వాళ్ళ దగ్గర మనీ, నెట్వర్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మన వెనుక ఉంటె మార్కెటింగ్ కూడా చాలా సులువై పోతుంది.

ప్రశ్న) కానీ కార్పోరేట్ సంస్థలు చిన్న సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. ఇది మంచిదంటారా?

స) ‘ఏమండీ.. ఇన్ని రోజులు మీ ఇంటి దగ్గర కిరాణ షాప్ లో కొనే వాళ్ళు ఇప్పుడు మాల్స్ కి వెళ్లి కొనడం లేదా? సినిమాలు కూడా అంతే (నవ్వులు)’. కార్పోరేట్ సంస్థలు మొదట పెద్ద సినిమాలపై దృష్టి పెట్టడం మంచిదే. దానివల్ల కాస్ట్ తగ్గుతుంది, వచ్చే రెవిన్యూ పెరుగుతుంది. కానీ ముందు వాళ్ళు సక్సెస్ చూసిన తర్వాత చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. మీరు చూసుకుంటే ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న అన్ని చిన్న సినిమాల వెనుక కార్పోరేట్ సంస్థలు ఉన్నాయి. ఇదే విధంగా టాలీవుడ్ లో కూడా జరగబోతోంది.

ప్రశ్న) ‘మనం’ సినిమా ‘బ్యాక్ టు ఫ్యూచర్’ ఆధారంగా తెరకెక్కుతోందా?

స) ఈ సినిమాలో ఎలాంటి సైన్స్ ఫిక్షన్ యాంగిల్ లేదు. మేము అలాంటి సినిమా కావాలనుకోలేదు. మనం చూడటానికి బాగుండే ఒక కామెడీ ఫిల్మ్.

ప్రశ్న) ఏఎన్ఆర్ గారు ఎలా ఉన్నారు?

స) నాన్నగారు బాగున్నారు. ఆపరేషన్ నుంచి మెల్లగా కోలుకుంటున్నారు, త్వరలోనే ఇంటికి వస్తారు. ఇంకా మనం కోసం ఆయన చేయాల్సిన రెండు, మూడు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆయన సినిమా పూర్తి చేసే విషయంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడి రోజుల తర్వాత మొదలవుతాయి.

ప్రశ్న) మీరు భాయ్ సినిమాపై బాగానే మనీ ఖర్చు పెట్టినట్టున్నారు?

స) (నవ్వుతూ) అవును. మేము సినిమా చాలా గ్రాండ్ గా రావాలని అనుకున్నాం. సినిమాని స్లోవేనియా మొదలైన అందమైన ఓవర్సీస్ లోకేషన్స్ లో షూట్ చేసాము. ఈ సినిమాలో ప్రతి ఫ్రేం బాగా రిచ్ గా అనిపిస్తుంది.

ప్రశ్న) ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ పాత్ర గురించి ఏం చెబుతారు?

స) రిచా మంచి నటి. సినిమాలో రిచా పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాటల్లో చాలా బాగా డాన్సులు చేసింది. సినిమాకి రిచా ఒక హైలైట్ అవుతుంది.

ప్రశ్న) ఈ వయసులో కూడా మీరు దేవీశ్రీ ట్యూన్స్ కి చాలా బాగా డాన్సులు చేస్తున్నారు..

స) (నవ్వులు) దేవీశ్రీ ట్యూన్స్ 80 ఏళ్ళ వారిని కూడా డాన్సులు చేయిస్తుంది. అతని ట్యూన్స్ లో ఆ ఎనర్జీ ఉంటుంది. ‘కింగ్’, ‘ఢమరుకం’కి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే భాయ్ సినిమా ఆడియో కూడా మంచి పాపులర్ అయ్యింది.

ప్రశ్న) ఈ సినిమా నుంచి అభిమానులు ఏమేమి ఆశించవచ్చు?

స) ఈ సినిమాలో ఉండే పంచ్ డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లాంటి కమర్షియల్ అంశాలను అభిమానులు బాగా ఇష్టపడతారు. ఈ సినిమాలో అభిమానులు కోరుకునే అన్నీ ఉంటాయి. నాది మరియు మా ఫ్యామిలీ అఫీషియల్ డేటాని నిర్వహిస్తున్న నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు మొదలు పెట్టి నేటితో 10 సంవత్సరాలు పూర్తయ్యింది. వాళ్ళు ఏమీ ఆశించకుండా ఈ పని చేస్తున్నారు.

అంతటితో నాగార్జునతో మా ఇంటర్వ్యూని ముగించాం. ఈ హన్డ్సం హీరో నటించిన ‘భాయ్’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం..

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు