రికార్డు ధియేటర్లలో ‘ఆగడు’ ఓవర్సీస్ రిలీజ్..!

రికార్డు ధియేటర్లలో ‘ఆగడు’ ఓవర్సీస్ రిలీజ్..!

Published on Sep 1, 2014 5:46 PM IST

aagadu
ఓవర్సీస్ అభిమానులలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో పెద్దగా కలెక్షన్స్ మూట కట్టుకోలేకపోయిన ‘ఖలేజా’, ‘1 నేనొక్కడినే’ సినిమాలు యు.ఎస్.ఏ మార్కెట్లో కాసుల కనక వర్షం కురిపించాయి. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ఓవర్సీస్ లో ఘనవిజయం సాదించాయి. సినిమా టాక్ తో సంభందం లేకుండా అమెరికాలో మహేష్ బాబు సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎగబడతారు.

‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆగడు’ సినిమాలో ఓవర్సీస్లో భారి ఎత్తున రిలీజ్ చేయనున్నారని సమాచారం. 100 మంది విద్యార్ధుల కంటే ఎక్కువ మంది చదువుతున్న యూనివర్సిటీలలో స్పెషల్ గా షో వేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 19న ‘ఆగడు’ విడుదలవుతుంది.

తమన్ సంగీతం అందించిన ‘ఆగడు’ ఆడియో ఇటివల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట. గోపి ఆచంట నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు