చౌదరిగారికి రేపే అసలైన పరీక్ష

చౌదరిగారికి రేపే అసలైన పరీక్ష

Published on Mar 27, 2015 12:54 AM IST

Y-vs-chowdary
‘దేవదాసు’, ‘సీతయ్య’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సూపర్ హిట్ సినిమాలతో వై.వి.ఎస్ చౌదరి ఒకప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాపులతో తన ఉనికిని కోల్పోయిన ఈ డైరెక్టర్ ఎలాగైనా పూర్వపు ఫామ్ ని సంతరించుకునే ప్రయత్నంలో వున్నాడు. తన దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ‘రేయ్’ సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకుని రేపు విడుదలకానుంది.

ఈ సినిమా దర్శకుడిగానే కాక నిర్మాతగా సైతం చౌదరిగారికి గట్టి పరీక్షే పెట్టనుంది. ఈ చిత్రంపై లెక్కలేనంతగా ఖర్చుపెట్టి కొండంత ఆశ, ఆకాశమంత నమ్మకాన్ని నిలిపాడు. కరేబియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కేవలం దుస్తులకే సింహభాగం ఖర్చయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా సయామీ ఖేర్ మరియు శ్రద్ధా దాస్ లు హీరోయిన్స్. ఇంతమంది నమ్మకముంచిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు