భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘అదిరింది’ !

భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘అదిరింది’ !

Published on Oct 20, 2017 5:29 PM IST


తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం బుధవారం విడుదలై భారీస్థాయి ఓపెనింగ్స్ ను సాధించిన సంగతి తెల్సిందే. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ‘అదిరింది’ కూడా డే రోజున రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ పనులు ఆలస్యం కావడంతో వాయిదాపడింది. పోనీ ఈ వారంలో ఏదో ఒక రోజు వస్తుందా అంటే అది కూడా లేదు. తమిళ చిత్ర వర్గల్ సమాచారం మేరకు సెన్సార్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

అంతేగాక వీలైనంత వరకు వచ్చే వారంలోనే విడుదల ఉండే అవకాశముందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు 400 స్క్రీన్లలో చిత్రం రిలీజవుతుందని సమాచారం. ఒక డబ్బింగ్ సినిమాకి 400 స్క్రీన్లంటే భారీ విడుదలనే చెప్పాలి. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ సమర్పిస్తున్నారు. కాజల్, సమంత, నిత్యామీనన్లు నటించిన ఈ చిత్రంలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు