2 మిలియన్ మార్కును అందుకున్న ‘అజ్ఞాతవాసి’ !

2 మిలియన్ మార్కును అందుకున్న ‘అజ్ఞాతవాసి’ !

Published on Jan 15, 2018 1:13 PM IST


ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కాని స్థాయిలో సుమారు రూ.570 కి పైగా స్క్రీన్లలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మొదటి రోజు ప్రీమియారాలతో కలిపి 1.5 మిలియన్లను రాబట్టి ఓపెనింగ్స్ పరంగా ‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో నిలబడింది. కానీ ప్రీమియర్ల నుండే మిక్స్డ్ టాక్ ఏర్పడటంతో రెండవ రోజునుండి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

రెండవ రోజు నుండి నిన్న ఆదివారం వరకు హాఫ్ మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేసి ఎట్టకేలకు 2 మిలియన్ కు చేరింది. పవన్ కు ఇదే మొదటి 2 మిలియన్ డాలర్ సినిమా కావడం విశేషం. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో 2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన చిత్రాల్లో ఇది 8వది కావడం విశేషం. దీని ముందు ‘బాహుబలి-2, బాహుబలి-1, శ్రీమంతుడు, అ..ఆ, ఖైదీ నెం 150, ఫిదా, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాలు 2 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం వీటిలో ఎన్నింటిని క్రాస్ చేసి ఎక్కడ నిలబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు