రూమర్లకు చెక్ పెట్టిన అఖిల్ హీరోయిన్ !
Published on Apr 11, 2018 12:12 pm IST

అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ చిత్రంతో వెండి తెరకు కథానాయకిగా పరిచయమయ్యారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. అయితే నిన్నటి నుండి ఆమె ప్రముఖ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తో ఒక సినిమా చేయనుందని, ఆ చిత్రాన్ని దర్శకుడు ఐవి.శశి కుమారుడు అనిశశి డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి.

వీటిపై స్పందించిన ఆమె ఇలాంటి రూమర్స్ ఎలా, ఎక్కడి నుండి వస్తున్నాయి. అయినా ఒకవేళ ఇదే నిజమైతే చాలా బాగుంటుంది అంటూ ఆ వార్తల్లో నిజం లేదని సున్నితంగా తెలియజేశారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం శర్వానంద్ కొత్త సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

 
Like us on Facebook