బన్ని గోనగన్నారెడ్డిగా ఎన్ని నిమిషాలు ఉంటాడో తెలుసా.?

బన్ని గోనగన్నారెడ్డిగా ఎన్ని నిమిషాలు ఉంటాడో తెలుసా.?

Published on Oct 6, 2015 4:03 PM IST

Allu-Arjun-As-Gona-Ganna-Re
ప్రస్తుతం టాలీవుడ్ సినీ అభిమానులు మరియు ఇండస్ట్రీ లోని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. అన్ని అడ్డంకులను క్లియర్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కి సిద్దమవుతోంది. భారీ చిత్రాల దర్శకుడు కాకతీయ వీరణారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క రుద్రమదేవిగా కనిపించనుంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ గోనగన్నారెడ్డి పాత్రపై వస్తున్న పలు పుకార్లపై దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు.

అందరూ గోనగన్నారెడ్డి అనేది ఓకే అతిధి పాత్ర అని అనుకుంటున్నారు, కానీ కాదు.. రుద్రమదేవి కథలో అది కూడా ఒక ప్రధాన పాత్రే.. అల్లు అర్జున్ సుమారు 50 నిమిషాల పాటు గోనగన్నారెడ్డిగా అందరినీ సర్ప్రైజ్ చేస్తాడని గుణశేఖర్ తెలిపాడు. ఇన్ని రోజులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడేమో అనుకున్న అభిమానులలో ఈ వార్త మరింత బలాన్ని తెచ్చింది. చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించనున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, నిత్యా మీనన్, కేథరిన్, హంసానందినిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి 2డి మరియు 3డి వెర్షన్స్ లో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రిలేజే చేయనున్నారు. ఒక వారం ఆలస్యంగా తమిళంలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు