మరో వివాదంలో అంజలి

మరో వివాదంలో అంజలి

Published on Jul 5, 2015 9:56 AM IST

anjali
స్వతహాగా తెలుగమ్మాయి, కానీ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నా ముద్దు గుమ్మ అంజలి. తెలుగులో అంజలి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నాలుగు పైగా సినిమాలను చేస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం అంజలి తన పిన్ని క్రియేట్ చేసిన వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు పడింది. ఆ వివాదాల నుంచి ఎలాగో బయటపడిన అంజలి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

కానీ తాజాగా అంజలి మరో వివాదంలో ఇరుక్కుంది. అంజలి తమిళంలో చేస్తున్న సినిమా ‘మాప్పిల్లై సింగం’. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం అంజలి 54 రోజులు కాల్షీట్స్ ఇచ్చింది. కానీ మేకర్స్ వాటిని సరిగా వాడుకోకుండా అందులో సగం రోజులు మాత్రమే షూటింగ్ కి వినియోగించుకున్నారు. దాంతో మిగిలిన టాకీ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఈ చిత్ర మేకర్స్ మళ్ళీ అంజలిని ఫ్రెష్ డేట్స్ ఇమ్మని అడుగుతున్నారు. కానీ ప్రస్తుతం అంజలి పలు తెలుగు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంది. దాంతో అంజలి ‘మాప్పిల్లై సంగం’ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో పెట్టుకోమని కోరింది. దానికి ఈ చిత్ర మేకర్స్ ఒప్పుకోకుండ్ అంజలి తమ సినిమా షూటింగ్ కి కోపరేట్ చేయడం లేదనే కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దాంతో అంజలి జరిగిన విష్యం చెప్పడమే కాకుద్నా మీడియాలో తనపై నెగటివ్ కామెంట్స్ చేయకండని మీడియా వారికి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు