స్టార్ హీరోతో సినిమాని కన్ఫర్మ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ !

anupama-parameshwaran
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. 2016 లో ఆమె నటించిన ‘ప్రేమమ్, అ..ఆ’ సినిమాలు భారీ విజయాలు సాధించడంతో లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్న ఆమెకు పెద్ద సినిమా ఛాన్సులు వస్తున్నాయి. త్వరలో మొదలుక్నున్న సుకుమార్ – రామ్ చరణ్ ల ప్రాజెక్టులో తాను నటిస్తున్నానని, రామ్ చరణ్, సుకుమార్ లతో కలిసి పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని అనుపమ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకోనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా చిరంజీవి 150వ చిత్రం ఖైదీకి సినిమాటోగ్రఫీ అందించిన రత్నవేలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుపమ, శర్వానంద్ తో కలిసి నటించిన ‘శతమానం భవతి’ చిత్రం రేపు విడుదలకానుంది.

 

Like us on Facebook