సిద్ధార్థ్ గ్రంధి దర్శకత్వంలో అసతోమ సద్గమయ

సిద్ధార్థ్ గ్రంధి దర్శకత్వంలో అసతోమ సద్గమయ

Published on Apr 25, 2018 8:07 PM IST

Asatoma sadgamaya

ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ గ్రంధి ఫిలసాఫికల్& ఆధ్యాత్మికం మీద ఇంకా ఫిలిమ్స్ తీయడానికి ఆశక్తి చూపిస్తున్నారు.అతను డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ&ఫిల్మ్ మేకింగ్ విద్యను రామానాయుడు స్టూడియోస్ లో పూర్తి చేశారు. ఇతను జీ. ఎం.ర్ అధినేత జీ .ఎమ్.ఆర్ కుటుంబంకి దగ్గర వ్యక్తి భారతదేశం లో ఎందరో గురువులు తో హిమాలయన్ మాస్టర్స్ తో కూడా ప్రయాణం చేసి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని ,భవిష్యత్తులో ఆధ్యాత్మిక తకి తను నూతన నాంది పలుకుతాడాని శ్రీవిధ్యానంద నాద గారు తెలియ చేశారు

భవిష్యత్ లో మోటివేషనల్ సినిమాలు, ఆధ్యాత్మిక డాక్యుమెంట్రి లు తీయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగానే అసతోమ సద్గమయ తెర మీద ఉన్నది.ఇందులో యశ్వంత్ తన నటనా సామర్థ్యం చూపించుకొని ఆ పాత్రకి సార్ధకం చేసాడు.అది చూసిన అందరూ అతనిని పొగిడారు.సినిమాలో పాత్రలకు సరిపోయే విధంగా మనుషుల్ని తీసుకున్న కారణంతో ఛానెల్స్ నుంచి మంచి అభిప్రాయం ఎర్పడింది. అలాగే ప్రియాంక & రాజశేఖర్ గారు , లహరి ఎంతో చక్కగా వారి సామర్ధ్యం చూపించుకున్నారు. ఈ చిత్రం స్వరూపనందసరస్వతి, మరియు శ్రీనివాసనంద స్వామి పీఠం అధ్యక్షులు శ్రీనివాసనంద స్వామి వారి చేతుల మీదిగా ఆవిష్కరించబడినది.

అసతోమ సద్గమయా, ఇది ఒక మొటివేషలనల్ సినిమా దీనిని ఫిల్మ్ మంత్రవారు సమర్పిస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఒక వ్యక్తి క్రుంగిపోతూ ఉంటాడు.దర్శకుడు ఆ పాత్రను తన దృష్టితో ఆ వ్యక్తి తాలూక అంతర్ బాధను తెలియ చేస్తాడు.ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడతాడు అనేది దర్శకుడు మనకి చూపిస్తారు . ఈ సినిమాలో దర్శకుడు భగవత్ గీత మరియు కర్మ ఫలితం ఎలా ఉంటుంది అనేది తెర పైన చూపించారు. అతని ప్రతి డైలాగ్స్ లో శ్రీ కృష్ణుని పాత్రలో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు.

దర్శకుడు ముఖ్య ఉదేశం…ప్రేక్షకులకు ఈ రోజులో జనం ఎంత తొందరగా డిప్రెషన్ ఐపోతున్నారూ ఆ కోపంలో ఉక్రోషంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో సమాజాన్నికి చూపించడమే. సినిమాలో ముఖ్య పాత్రకి ఉద్యోగం లేక తన జీవితంలో నరక యాతన అనువాభిస్తున్నాడు.ఆఖరికి శ్రీ కృష్ణుని నిందిస్తున్నాడు

సినిమా ముఖ్య పాత్ర ఐన శ్రీ కృష్ణ అంతర్ శబ్దంతో మొదలైతుంది.అతను ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు తన గురించి లోకానికి చాటి చెప్పుకుందామా అని .కానీ ప్రతి సారి తనకి అపజయమే ఎదురవుతుంది .శ్రీకృషుడు ఇచ్చిన వరాలను ఉపయోగించుకొని తను జీవితంలో తన కలల్ని నెరవేర్చు కున్నాడా లేదా అసలు శ్రీకృష్ణడు ఏమి సందేశం ఇవ్వాలనుకున్నాడు అనేది కథ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు