జర్మనీ లో మొదలైన బాహుబలి సందడి..!

జర్మనీ లో మొదలైన బాహుబలి సందడి..!

Published on Apr 28, 2016 4:15 PM IST

baahubali
దాదాపు విడుదలై పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ బాహుబలి : ది బిగినింగ్ నిత్యం వార్తల్లో ఉంటున్నది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇండియాలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించబడి తెలుగు, తమిళ్, హిందీ, మళయాలం భాషల్లో విడుదలై 600 కోట్ల రూపాయలు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమైన ఈ సినిమాకు అక్కడ వచ్చిన స్పందనతో చైనా, జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాలతో పాటు మొత్తం 70 దేశాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయా దేశాలకు చెందిన టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే జర్మనీ దేశంలో ఈ సినిమా హక్కులను అక్కడి పాపులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్ప్లెండిడ్ ఫిల్మ్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జర్మనీ హక్కులు పొందిన స్ప్లెండిడ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫిలిం సెలక్ట్ అనే లోకల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కలిసి ఈ రోజు జర్మనీ (డొయ్చే) భాషలో బాహుబలి : ది బిగినింగ్ ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నది. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డులు సాధించిన బాహుబలి : ది బిగినింగ్ ఇప్పుడు జర్మనీ లో ఎటువంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు