సెన్సార్ పూర్తి చేసుకున్న బీచ్ రోడ్ చేతన్

సెన్సార్ పూర్తి చేసుకున్న బీచ్ రోడ్ చేతన్

Published on Nov 19, 2019 9:11 AM IST

చేతన్ మద్దినేని ఈ ఏడాది ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. కన్నడ హిట్ మూవీ తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఇక్కడ పర్వాలేదనిపించింది.చేతన్ మద్దినేని మాత్రం హీరోగా కామన్ సెన్స్ లేని ర్యాంకర్ మరియు అప్డేటెడ్ ఈకాలపు స్టూడెంట్ గా రెండు భిన్న పాత్రలలో మెప్పించారు. కాగా చేతన్ తాజాగా ‘బీచ్ రోడ్ చేతన్’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది.

దీనితో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు బీచ్ రోడ్ చేతన్ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఫాంటసీ కాన్సెప్ట్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని చేతన్ మద్దినేని నిర్మించడంతో పాటు, దర్శకత్వం కూడా వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు