నేడే ‘భలే భలే మగాడివోయ్’కి సెన్సార్

నేడే ‘భలే భలే మగాడివోయ్’కి సెన్సార్

Published on Aug 27, 2015 11:54 AM IST

Bhale-Bhale-Magadivoi
లో బడ్జెట్ లో సూపర్ క్వాలిటీ సినిమాలు తీసి విజయాలు అందుకున్న యంగ్ డైరెక్టర్ మారుతి తెలుగు ప్రేక్షకుల మదిలో తన ఫ్యామిలీ లో ఒకడుగుగా కలిసిపోయిన యంగ్ హీరో నాని కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. దాంతో ఈ చిత్ర టీం ఈ రోజు ఈ సినిమాని సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. ఈ రోజు సాయంత్రం లోగా సెన్సార్ వారు ఈ సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ని ఇవ్వనున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా చివర్లో మనల్ని థ్రిల్ చేసే అంశం కూడా ఉండనుండడం విశేషం. సెప్టెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. యంగ్ హీరో నాని ఈ సినిమాలో మతిమరపు రాజాగా కనిపించి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టనున్నాడు. . టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకూ అందరూ నవ్వుతూనే ఉంటారని ఈ చిత్ర టీం చెబుతోంది. నాని సరసన లావణ్య త్రిపాట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ బ్యానర్ వారు కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు