బాలీవుడ్ కింగ్ ఖాన్ రిలీజ్ చేయనున్న ‘అఖిల్’ ఫస్ట్ టీజర్

బాలీవుడ్ కింగ్ ఖాన్ రిలీజ్ చేయనున్న ‘అఖిల్’ ఫస్ట్ టీజర్

Published on Aug 29, 2015 12:13 PM IST

akhil
ఒక చిన్న అతిధి పాత్రతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకొని, భారీ అంచనాల నడుమ అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం యంగ్ హన్డ్సం హీరో అఖిల్ అక్కినేని. ఆ అంచనాలను అందుకునే విధంగానే టాలీవుడ్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ అఖిల్ మొదటి సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే అఖిల్ మొదటి సినిమాకి ‘అఖిల్’ అనే టైటిల్ నే ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘అఖిల్’ ఫస్ట్ లుక్ టీజర్ ని నాగార్జున బర్త్ డే కానుకగా ఈ రోజు రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియ్యజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని ఓ స్టార్ హీరో చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు.

ఇంతకీ ఎవరా హీరో అనే విషయానికి వస్తే.. బాలీవుడ్ కింగ్ ఖాన్, బాక్స్ ఆఫీసుకి బాద్షా అయిన సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ‘అఖిల్’ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం నాగార్జున సల్మాన్ ఖాన్ ని కలిసి ఇద్దరూ కలిసి టీజర్ ని లాంచ్ చేయనున్నారు. ముందుగా సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ పేజ్ ద్వారా టీజర్ ని పోస్ట్ చేస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఖిల్ లుక్ అండ్ మాస్ అప్పియరెన్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి. సెప్టెంబర్ మిడిల్ కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే కానుకగా ఆడియోని రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో మెలోడీ టచ్ – మాస్ బీట్ ఏదీ మిస్ కాకూడదని అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నారు. అఖిల్ సరసన హీరోయిన్ గా చేస్తున్న సయేషా సైగల్ కి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు