డింపుల్ గా నవ్వించడానికి సిద్దమైన బ్రహ్మానందం

డింపుల్ గా నవ్వించడానికి సిద్దమైన బ్రహ్మానందం

Published on Jul 24, 2014 8:37 AM IST

Brahmanandam
కామెడీ కింగ్ బ్రహ్మానందం – ఈ పేరు వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి పట్టలేనంత నవ్వు వస్తుంది. దానికి కారణం ఆయన ఇప్పటి వరకూ చేసిన పాత్రలే.. బ్రహ్మి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అన్నా, బాబీ అన్నా, జిలేబీ.. ఇలా పేరుతోనే ప్రేక్షకులను తెగ నవ్వించాడు. బ్రహ్మానందం మరోసారి కీలక పాత్ర పోషించిన ‘అల్లుడు శీను’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు డింపుల్.

‘వివి వినాయక్ ప్రతి సినిమాలోనూ నాకు మంచి పాత్ర ఇవ్వడమే కాకుండా ఒక వెరైటీ పేరు పెడుతుంటాడు. ఇందులో డింపుల్ అని పెట్టాడు. బాబీ, జిలేబీ ఎంత ఫేమస్ అయ్యాయో ఈ పాత్ర కూడా అంతే ఫేమస్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది తోలి చిత్రమే అయినా చాలా అనుభవం ఉన్న వాడిలా నటించాడు. కచ్చితంగా మంచి హీరో అవుతాడని’ బ్రహ్మానందం అన్నాడు.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ – సమంత జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు