కథ ఎవరికి చెప్పినా అద్భుతంగా ఉంది అంటున్నారు – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అటు హీరోగా ‘రంగస్థలం 1985’ షూటింగ్లో బిజీగా ఉంటూనే ఇటు తండ్రి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణ భాధ్యతల్ని కూడా భుజాన వేసుకుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేవలం అభిమానులే గాక తాము కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆతురతగా ఉన్నామని అంటున్న చరణ్ ఈ ప్రాజెక్టులోకి సురేందర్ రెడ్డి రాక గురించి ముఖ్య విషయాల్ని వెల్లడించారు.

‘ధృవ ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్ళినప్పుడు సూరిని తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని అడగ్గా నాన్నగారితో ఒక సినిమా చేయాలనుంది, ఛాన్స్ దొరుకుంటుందా అని అడిగారు. నేను వెంటనే నాన్నకు ఫోన్ చేసి అడిగాను. అప్పటికే నరసింహారెడ్డి కథా చర్చల్లో ఉన్న ఆయన ఒకసారి కలవమన్నారు. నేను నాన్నకు, సూరికి మీటింగ్ ఏర్పాటు చేశాను. ప్రాజెక్ట్ ఓకే అయింది. సూరి ప్రాజెక్ట్ లోకి వచ్చాక కథ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఎవరికి చెప్పినా అద్భుతంగా ఉంది ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతురతతో ఉన్నాం అంటున్నారు’ అంటూ సురేందర్ రెడ్డి సినిమా కోసం ఎంత కష్టపడుతున్నది వెల్లడించారు.

 

Like us on Facebook