చరణ్ – సుకుమార్ ల మూవీకి ముహూర్తం డీటైల్స్

చరణ్ – సుకుమార్ ల మూవీకి ముహూర్తం డీటైల్స్

Published on Feb 9, 2016 2:50 PM IST

ram-charan-and-sukumar
‘బ్రూస్ లీ – ది ఫైటర్’ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కథల ఎంపికలో కాస్త నిధానాన్ని పాటించిన మెగా పవర్ స్టార్ ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ లో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలాగే త్వరలోనే షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. ముందుగా ఫిబ్రవరి 21 నుంచి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయనున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.

సురేందర్ రెడ్డి సినిమా తర్వాత వెంటనే సుకుమార్ సినిమా ఉంటుంది. ఇటీవలే సుకుమార్ చరణ్ ని కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టొరీ లైన్ చెప్పగా దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి మూవీని ఫిబ్రవరి 21న మొదలెట్టి జూలై కల్లా పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చరణ్ టీం తెలిపిన దాని ప్రకారం సుకుమార్ సినిమాని జూన్ సెకండాఫ్ లో లేదా జూలై లో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసాడట. ఓ బడా నిర్మాత ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాని 2016 చివర్లో లేదా 2017 మొదట్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు కాకుండా కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత అది ఉంటుంది. చరణ్ కథల విషయంలో ఓ 5 నెలలు గ్యాప్ తీఉస్కున్నా వరుసగా 3 సినిమాలతో బిజీ అయిపోనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు