యూఎస్ బాక్సాఫీస్ మీద కన్నేసిన రామ్ చరణ్ !

dhruva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ‘ధృవ’ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 9న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ల, ఫస్ట్ లుక్స్, ఆడియో అన్నీ సినిమాపై మంచి పాజిటివ్ హైప్ ను క్రియేట్ చేశాయి. వరుసగా రెండు పరాజయాల తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సరికొత్త ప్లాన్ వేశాడు. అదేమిటంటే యూఎస్ లో ప్రదర్శించబోయే మొదటి షోను అభిమానులు, ప్రేక్షకులతో కలిసి చరణ్ వీక్షించనున్నాడట.

అలాగే వాళ్లతో పర్సనల్ గా కూడా కాసేపు మాట్లాడతాడని కూడా తెలుస్తోంది. అయితే ఏ విషయంపై ఇంకా చరణ్ టీమ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ చరణ్ ఇలాగే చేస్తే ఓవర్సీస్ లో అతని మార్కెట్ కాస్త ఊపందుకునే అవకాశముంది. ఇకపోతే ఈ సినిమాకు సంబందించితిన్ ట్రైలర్ ను ఈరోజు రాత్రి 7 గంటలకు గీత ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్లో విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఒరిజినల్ వర్షన్ లో విలన్ గా నటించిన అరవింద స్వామి ఈ తెలుగు వర్షన్ లో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

 

Like us on Facebook