ఇంకొద్దిసేపట్లో ‘డీజే’ యొక్క అరుదైన రికార్డును ప్రకటిస్తారట !


‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న అల్లు అర్జున్ అభిమానుల కోసం ఇంకొద్దిసేపట్లో మరో సప్రైజింగ్ సమాచారం బయటకురానుంది. ఇప్పటికే మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా మరో అరుదైన, కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుందట. అది కూడా నైజాం ఏరియాకు సంబంధించిన రికార్డు కావడం మరో విశేషం.

ఈ రికార్డ్ కు సంబందించిన పూర్తి వివరాలను ఇంకొద్ది గంటల్లో బయటపెడతామని, ఇది చాలా ఎగ్జైటెడ్ గా ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న బన్నీ అండ్ టీమ్ త్వరలోనే ఇండియాకు తిరిగొచ్చి మలయాళ వెర్షన్ విడుదలకు సంబందించిన ప్రమోషన్లను ప్రారంభించనున్నారు.

 

Like us on Facebook