‘డీజే’ విడుదల తేదీ ఖరారు !
Published on Apr 22, 2017 9:30 am IST


అల్లు అర్జున్ అభిమానులకు సడెన్ సర్ప్రైజ్. దువ్వాడ జగన్నాథమ్ చిత్ర విడుదల తేదీని కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ఖరారు చేసింది.డీజే జూన్ 23 న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

కాగా కొద్ది రోజులుగా డీజే చిత్రం ఆగష్టుకు వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. విడుదల తేదీని ప్రకటించి ఆ పుకార్లన్నింటికీ చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. కాగా జూన్ 23 నే చిత్రం విడుదలలవుతుండడంతో బన్నీ అభిమానులు సంతోషం ఉన్నారు. సరైనోడు వంటి బ్లాక్ బాస్టర్ విజయం తరువాత వస్తున్న అల్లు అర్జున్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఆచారి పాత్రలో నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook