ప్రత్యేక ఇంటర్వ్యూ : వీణ ఘంటశాల – తెలుగు ఇండస్ట్రీలో తెర వెనుక పనిచేసే వాళ్ళకి కూడా గుర్తింపు లభిస్తుంది

ప్రత్యేక ఇంటర్వ్యూ : వీణ ఘంటశాల – తెలుగు ఇండస్ట్రీలో తెర వెనుక పనిచేసే వాళ్ళకి కూడా గుర్తింపు లభిస్తుంది

Published on Jun 26, 2014 6:37 PM IST

veena
ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అవుతున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ వీణ ఘంటశాల. ఈమె లెజండ్రీ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటశాల గారి మనవరాలు. అలాగే బాగా తెలిసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ రత్న కుమార్ కుమార్తె. సింగర్ గా ట్రైన్ అయిన ఈ భామ ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటుకుంటోంది. మల్టీ టాలెంట్ ఉన్న వీణతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సినీ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువ సమయం ఎందుకు పట్టింది?

స)
సినిమాలలోకి వచ్చే కంటే ముందు నేను నా స్టడీస్ పూర్తి చేయాలనుకున్నాను. ముందుగా నేను డబ్బింగ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. కాస్త అనుభవం వచ్చాక ఇంకాస్త బెటర్ గా ఏమన్నా చేయాలి అనిపించింది. అప్పుడే నేను శబ్దాలయ థియేటర్ పప్పు గారిని కాంటాక్ట్ అయ్యాను. నన్ను నేను పరిచయం చేసుకొని, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అడిగాను. ఆయన అప్పుడు నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. వచ్చాక ‘1 నేనొక్కడినే’, ‘హార్ట్ అటాక్’ సినిమాలకు వాయిస్ టెస్ట్ చేసారు. ఫైనల్ గా హార్ట్ అటాక్ లో ఆద శర్మకి వాయిస్ ఇచ్చాను.

ప్రశ్న) మీ ఫస్ట్ మూవీ ‘హార్ట్ అటాక్’ హిట్ అయ్యాక రెస్పాన్స్ ఎలా వచ్చింది?

స) ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకు వచ్చిన గుర్తింపును చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. మామూలుగా స్టార్స్ ఓ హిట్ కొడితే పాపులర్ అవుతారు. కానీ నా డబ్బింగ్ ని కూడా పబ్లిక్ మెచ్చుకుంది. అలాగే చాలా మంది నా వాయిస్ ఆద శర్మ పాత్రని బాగా ఎలివేట్ చేసిందని చెప్పారు.

ప్రశ్న) సినిమాల్లో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు?

స) ముందుగా డైరెక్టర్ హీరోయిన్ పాత్ర గురించి నాకు చెప్తారు. ఆ తర్వాత డబ్బింగ్ రూంలో లిప్ సింక్ ని బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే..

ప్రశ్న) మీరు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పనిచేసారు. ఈ రెండు చోట్ల మీరు చూసిన తేడా ఏంటి?

స) తమిళ్ ఇండస్ట్రీలో తెరపై కనిపించే స్టార్స్ కె గుర్తింపు వస్తుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో తెర వెనుక పనిచేసే వాళ్ళకి కూడా గుర్తింపు లభిస్తుంది.

ప్రశ్న) మీరు సింగర్ కూడా.. ఇప్పటి వరకూ ఏదైనా సినిమాకి ప్లే బ్యాక్ సింగర్ గా పాడారా.?

స) అవును.. ఇప్పటికే నేను ‘అందాల రాక్షసి’ సినిమాలో ‘నే నిన్ను చేరగా’ అనే పాటని పాడాను. ప్రస్తుతం నేను కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. త్వరలో సింగర్ గా మరికొన్ని ఎక్కువ సాంగ్స్ పాడే అవకాశం ఉంది.

ప్రశ్న) మీరు చూడటానికి బాగున్నారు.. ఎప్పుడూ సినిమాల్లో కానీ, బుల్లితెరపై కానీ కనిపించాలని అనుకోలేదా?

స) హార్ట్ అటాక్ సినిమా తర్వాత కొన్ని టీవీ షోస్ ఆఫర్స్ వచ్చాయి. ముందుగా నేను నా డబ్బింగ్ కెరీర్ పై దృష్టి పెట్టాను. భవిష్యత్తులో టెలివిజన్ లో షోస్ చేసే అవకాశం ఉండొచ్చు.

ప్రశ్న) ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏమిటి?

స) నేను ఇప్పటికే ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసాను. ప్రస్తుతం బండ్ల గణేష్ గారి ‘నీజతగా నేనుండాలి’ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నాను.

ప్రశ్న) ‘నీజతగా నేనుండాలి’ సినిమా బాలీవుడ్ మూవీ ‘ఆషికి 2’కి రీమేక్. అందులో హీరోయిన్ రోల్ చాలా టఫ్ గా ఉంటుంది. మరి మీరెలా చెబుతున్నారు?

స) అవును మీరన్నది నిజమే.! హీరోయిన్ పాత్రలో చాలా బాధ, అమాయకత్వం కలిసి ఉంటాయి. నాకు కష్టంగా అనిపించింది. కానీ బాగా టైం తీసుకొని చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కచ్చితంగా నాకు మంచి గుర్తింపు వస్తుంది.

ప్రశ్న) మీకు నచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు?

స) నాకు డబ్బింగ్ లో స్ఫూర్తి అంటే మా నాన్న రత్న కుమార్ మరియు కవిత.

ప్రశ్న) ఒకవైపు సింగింగ్ మరోవైపు డబ్బింగ్.. ఇలా రెండింటినీ ఎలా బాలన్స్ చేయగలుగుతున్నారు?

స)
సింగింగ్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. భవిష్యత్తులో ఫుల్ టైం సింగర్ గా ఉండాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ పరంగా మీరు ఏ హీరోయిన్ కి అన్నా డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నారా.?

స) నేను ప్రముఖంగా ఒక హీరోయిన్ కె చెప్పాలని అనుకోవడం లేదు. అందరి హీరోయిన్స్ కి చెప్పాలనుకుంటున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, తన కెరీర్లో ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వీణకి ఆల్ ది బెస్ట్ చెప్పాము..

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు