రాజమౌళి మూవీపై మహేష్ సమాధానం ఏమిటో?

రాజమౌళి మూవీపై మహేష్ సమాధానం ఏమిటో?

Published on May 30, 2020 10:00 PM IST

రేపు మహేష్ ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ లో చాట్ చేయనున్న విషయం తెలిసిందే. మహేష్ గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అనేక ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు. వాటిలో ముఖ్యంగా ఆయన కొత్త మూవీ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఐతే రాజమౌళి మూవీపై ఫ్యాన్స్ లో ఆసక్తిగా ఉండగా ఆ కోణంలోనే ఫ్యాన్స్ మహేష్ కి ప్రశ్నలు సంధించనున్నారని తెలుస్తుంది.

రాజమౌళితో మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన మహేష్ తో తన నెక్స్ట్ మూవీ ఉంటుంది అని చెప్పడంతో దానిపై ఫ్యాన్స్ లో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. మరి రేపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నలకు మహేష్ ఏమి సమాధానాలు చెవుతారో చూడాలి. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ పరుశురాంతో చేస్తున్నట్లు సమాచారం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు