50 కోట్లు కొల్లగొట్టిన ‘కాంచన 2’!

50 కోట్లు కొల్లగొట్టిన ‘కాంచన 2’!

Published on May 6, 2015 4:51 PM IST

ganga-movie-review

హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా ఆ సిరీస్‌లో మూడో సినిమాగా ‘కాంచన 2’ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట ఏప్రిల్ 17న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లో రూ. 51కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా అన్ని ప్రాంతాలను కలుపుకొని ఈ సినిమా ఈ 50 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ మొత్తంలో ప్రొడ్యూసర్ షేర్ 27కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రూ. 20కోట్ల బడ్జెట్ లోపే రూపొందిన ఈ సినిమా సాటిలైట్ రెవెన్యూ, థియేటర్ రెవెన్యూ ఇలా అన్నీ కలుపుకుంటే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్టే లెక్క అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సినిమా తెలుగులో ‘గంగ’ పేరుతో డబ్ అయి గత శుక్రవారమే విడుదలైంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఫస్టాఫ్‌లోని హర్రర్ పార్ట్, మాస్ కామెడీ, తాప్సీ, నిత్యామీనన్‌ల నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా తర్వాత రాఘవ లారెన్స్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు