ప్రసంశలందుకుంటున్న ఫేమస్ రైటర్ !

sai-madhav-burra
ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఒక రచయితా పేరు మారుమోగిపోతోంది. ఆయన రాసిన మాటలకు ప్రేక్షకులు, సినీ జనాలు ఫిధా అయిపోతున్నారు. ఆ సంచలనం ఎవరో కాదు సాయి మాధవ్ బుర్రా. ఆయన తాజాగా రెండు భారీ ప్రాజెక్టులైన చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లు తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుని రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్నాయి.

ఈ సినిమాల్లో ప్రేక్షకులందరికీ నచ్చిన అంశాల్లో సాయి మాధవ్ రాసిన డైలాగులు కూడా ఉన్నాయి. చిరు, బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు అద్భుతమైన మాటలు రాశాడు సాయి మాధవ్. ముఖ్యానంగా ఈరోజు విడుదలైన శాతకర్ణి చిత్రానికి అయితే తన మాటలతో సరికొత్త బలాన్నిచ్చి థియేటర్లో ప్రేక్షకులు బాలయ్య, క్రిష్ పేర్లతో పాటే తన పేరుని కూడా అప్పుడప్పుడు స్మరణ చేసేలా చేశాడు. ఈ రెండు సినిమాలతో ప్రస్తుతం సాయి మాధవ్ టాలీవుడ్ లోని స్టార్ రైటర్లలో ముందు వరుసలో నిలబడిపోయారు.

 

Like us on Facebook