తెలుగులో “కేజీయఫ్ 2” హక్కులకు భారీ డిమాండ్.?

తెలుగులో “కేజీయఫ్ 2” హక్కులకు భారీ డిమాండ్.?

Published on Jan 21, 2021 12:00 PM IST

ఇప్పుడు దక్షణాది నుంచి వస్తున్న ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో సెన్సేషనల్ చ్చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అన్ని ఇండస్ట్రీలలో కూడా కనీ వినీ ఎరుగని స్థాయి అంచనాలు సెట్ చేసుకుంది.

మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలోనే జరుగుతుంది. మరి ఇదిలా ఉంటే చాప్టర్ 1 మన దగ్గర డీసెంట్ గానే విడుదల అయ్యినా రిజల్ట్ మాత్రం వైలెంట్ గానే వచ్చింది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు గాను భారీ డిమాండ్ ఏర్పడినట్టు టాక్. మరి ఓవరాల్ గా ఫిగర్ ఎక్కడ ఆగుతుందో కానీ 50 కోట్ల పైమాటే అన్నట్టు వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు