ఆమీర్ ఖాన్ ‘పి.కె’ తో ‘ఐ’ ట్రైలర్

ఆమీర్ ఖాన్ ‘పి.కె’ తో ‘ఐ’ ట్రైలర్

Published on Dec 18, 2014 4:00 AM IST

I_1

శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఐ’ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధపడుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రచార కార్యకరమాలపై సైతం దృష్టిపెట్టారు. త్వరలో ‘ఐ’ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదలచేయనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హిందీ వెర్షన్ ట్రైలర్ ని డిసెంబర్ 19న ఆమీర్ ఖాన్ ‘పి.కె’ సినిమాతో విడుదల చేయనున్నారు. హిందీలో ‘ఐ’ సినిమాకు ప్రచారం అవసరమైన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

ఈ సినిమా విక్రమ్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఏ ఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు