సూర్య మాస్ లుక్, సమంత గ్లామర్ కేక అంటున్న కోలీవుడ్

సూర్య మాస్ లుక్, సమంత గ్లామర్ కేక అంటున్న కోలీవుడ్

Published on Jul 22, 2014 6:37 PM IST

anjana

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సౌత్ ఇండియన్ గ్లామర్ డాల్ సమంత హీరోయిన్ గా నటించిన సినిమా ‘అంజాన్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు చెన్నైలోని సత్యం థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా మరియు కొంతమంది సెలెక్టెడ్ సూర్య ఫ్యాన్స్ కి ‘అంజాన్’ లోని ‘బాంగ్ బాంగ్ బాంగ్’, ‘ఏక్ దో తీన్ చార్’ పాటలను వేసి చూపించారు.

‘బాంగ్ బాంగ్ బాంగ్’ అనే పాట సూర్య యాక్షన్ ఎప్పిసోడ్స్ తో ఉంటుంది. కొంత పార్ట్ క్లబ్ లో ఉండే ఈ సాంగ్ లో సూర్య తన ప్రత్యర్ధులను చంపుతుంటాడు. ఈ పాటలో సూరి ట్రెండ్ సెట్టింగ్ లుక్, మాస్ అప్పియరెన్స్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందని కోలీవుడ్ అంటోంది. ఇక పోతే ‘ఏక్ దో తీన్ చార్’ అనేది సూర్య – సమంతలపై వచ్చే పక్కా మాస్ మసాలా సాంగ్. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ లో చాలా కాలం ఉండిపోయేలా ఉందని, ఈ పాటలో సూర్య మాస్ లుక్ – సమంత అల్ట్రా గ్లామరస్ లుక్ హైలైట్ గా నిలుస్తుందని సూర్య అభిమానులు అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాకి సూర్య ట్రెండ్ సెట్టింగ్ లుక్, సమంత గ్లామరస్ టచ్ సినిమాకి హైలైట్ అవుతాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

యువన్ శంకర్ రాజా అందించిన ఈ మూవీ ఆడియో ఆల్బమ్ రేపటి నుంచి మార్కెట్లో లభిస్తుంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. అదే రోజున తెలుగులో ‘సికంధర్’ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు