ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు.. నిజమేనా ?

ntr
‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ఆ గ్యాప్ లో కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ దర్శకుడు కథ తీసుకెళ్ళినా ఓపిగ్గా వింటూ వచ్చిన తారక్ చాలా అషన్ల తరువాత చివరగా ‘పవర్, సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ బాబీ కథకు మెచ్చి ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా మంది దర్శకులు మెప్పించలేకపోయిన ఎన్టీఆర్ ను బాబీ కదిలించడంతో అతను చెప్పిన కథలో ఏదో పెద్ద విశేషం ఉందనే నమ్మకం అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. దానికి తోడు గత రెండు రోజుల నుండి ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తూ అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

అవేమిటంటే ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట. అందుకే ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ చొప్పున మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారట. ఈ హీరోయిన్లందరూ స్టార్ హీరోయిన్లే అయ్యే అవకాశముందని కూడా అంటున్నారు. పైగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని, అందులో కూడా ఒక స్టార్ హీరోయిన్ కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలన్నీ ఎంత వరకు నిజమో తెలియాలంటే తారక్, బాబీల్లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. ఇకపోతే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాతకంపై స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2017 లో ప్రారంభం కానుంది.

 

Like us on Facebook