ఇంటర్వ్యూ : లక్ష్మీ మంచు – కె.ఆర్.ఆర్ తో ‘ఝుమ్మంది నాదం’ చేయడం నా మొదటి తప్పు.!

ఇంటర్వ్యూ : లక్ష్మీ మంచు – కె.ఆర్.ఆర్ తో ‘ఝుమ్మంది నాదం’ చేయడం నా మొదటి తప్పు.!

Published on May 4, 2015 7:47 PM IST

manchu-lakshmi
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు వారసురాలిగా తెలుగు తెరకు పరిచయమై సినిమాకి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ సినిమాలు చేస్తున్న నటి, నిర్మాత లక్ష్మీ మంచు. లక్ష్మీ మంచు మెయిన్ లీడ్ గా చేసిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 8న ప్రేక్షకులకు నవ్వులను పంచడానికి వస్తోంది. ఓ పక్కన మంచు మనోజ్ పెళ్లి పనులు మరియు సినిమా రిలీజ్ విషయంలో బిజీ బిజీగా ఉన్న లక్ష్మీ మంచు ‘దొంగాట’ గురించి మాతో పంచుకున్న విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా ‘దొంగాట’ గురించి, ఆ తర్వాత ఇందులో మీరు చేసిన పాత్ర గురించి చెప్పండి.?

స) ‘దొంగాట’ క్రైమ్ కామెడీ జోనర్ లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. నేను ఇలాంటి సినిమా ఇంతకముందు చేయలేదు. ఇందులో నేను ఓ స్టార్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. ఒక స్టార్ హీరోయిన్ ని కొందరు కిడ్నాప్ చేస్తారు. అసలు ఎందుకు చేస్తారు.? తను ఎలా తప్పించుకుంది.? అన్నదే కథ. నేను ఇందులో అవుట్ అండ్ అవుట్ ఫన్నీ రోల్ చేసాను. ఫుల్ కామెడీ ఉంటూనే ఓ హార్ట్ టచింగ్ మెసేజ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మనవ సంబంధాలు – మనీ కి మధ్య ఉన్న రిలేషన్ ని చూపిస్తాము. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. గుండెల్లో గోదారికి కూడా ఇంత టెన్షన్ పడలేదు.

ప్రశ్న) మీరు పాడిన ‘యాందిరో’ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది.. ఈ రెస్పాన్స్ ని మీరు ముందే ఊహించారా.?

స) అది మేము ఎవ్వరం ఊహించలేదు. 17 మంది హీరోలతో కలిసి ఓ పాట చేసాము, నేను అది బాగా ఫేమస్ అవుతుందని అనుకున్నాను. కానీ నా సాంగ్ కి ఇంట మంది రెస్పాన్స్ రావడం చూసి నేను థ్రిల్ అయ్యాను. అంతలా రిసీవ్ చేసుకుంటారని అనుకోలేదు.

ప్రశ్న) మగ వాళ్ళ మీద ఏమన్నా కోపమా.. యాందిరో పాటని అలా రాయించడానికి గల కారణం.?

స) నేను ఈ పాటలో మగవారిని పర్సనల్ గా ఏమీ తిట్టలేదు. జస్ట్ విమర్శించాను.. నా ప్రకారం మగ వాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు. నేను చాలా రోజుల నుంచి ఈ ఫీలింగ్ తో సఫర్ అవుతున్నాను. ముఖ్యంగా ఇండియాలో ఎందుకో అమ్మాయి అంటే ఓ చిన్న చూపు, వాళ్ళలో టాలెంట్ ఉండదా..? నేను అందరికీ సమానంగా అన్నీ చేయగలిగే స్వేఛ్చ ఉందని అంటాను. చెప్పాలంటే ముందు ఈ పాట నేను పాడాలని అనుకోని ఇలా రాయించలేదు. కథలో భాగంగా రాసారు, ఆ తర్వాత నేను పాడితే బాగుంటదని అంటే పాడేసాను.

ప్రశ్న) అంతమంది హీరోస్ ని ఎలా ఒకటి చేసి ఈ సాంగ్ చేయగలిగారు.?

స) ముందుగా కథానుసారం వచ్చే ఈ పాట కోసం పలువురు హీరోలతో కలిసి చేయాలనుకున్నాం, కానీ మన తెలుగులో ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూపిస్తాం అని ఎవరూ చెయ్యరని కొందరు అన్నారు. కానీ నా ప్రయత్నంగా అడిగాను. అడిగిన వెంటనే అందరూ చేస్తానని వచ్చి చేసేసారు. చెప్పాలంటే ఇంకా కొంతమంది వస్తా అన్నారు. కానీ టైం కుదరక వాళ్ళతో చేయలేకపోయాం.

ప్రశ్న) దొంగాటని పగడ్బందీగా ప్లాన్ చేసి చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తీసినట్టు ఉన్నారు.?

స) అవును పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాని తీశాం. లో బడ్జెట్ లో తియ్యలేదు కానీ అనుకున్న బడ్జెట్ లో సినిమాని ఫినిష్ చేసాం. చెప్పాలంటే కె. రాఘవేంద్రరావుతో ఝుమ్మంది నాదం సినిమా చేయడం నేను చేసిన మొదటి తప్పు.. ఎందుకంటే రాఘవేంద్ర రావు నాకు పెద్ద ఇబ్బంది కలగకుండా అన్నీ ఆయనే చేసుకున్నారు. దాంతో ప్రొడక్షన్ పరంగా ఏమీ నేర్చుకోలేదు. అందుకే ఆ సినిమా చేయడం నేను చేసిన తప్పని ఫీలవుతాను. ఆ తర్వాత చేసిన ఊ కొడతార ఉలిక్కి పడతారా కూడా ఐడియా లేకపోవడం వలన ఎక్కువ పెట్టి చేసేసాను. తర్వాతే తెలుసుకున్నాను. ప్రోడక్ట్ ని పట్టి బడ్జెట్ పెట్టాలని.. ఆ విషయంలో నాకు ముఖేష్ భట్ ఓ సలహా ఇచ్చారు .. ‘సినిమా చేయడం తప్పు కాదు.. ఎప్పుడూ అనుకున్న బడ్జెట్ లో తీయాలి’. దాన్నే ఫాలో అవుతున్నాను. ఒక నిర్మాతగా దొంగాట విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను.

ప్రశ్న) ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ మనీ, మనీ మనీ లానే ఉంటుందా.?

స) ఎక్కడో మాకు అలానే ఉందని రాము గారికి చెప్పాం ఆయన కథ విని సూపర్బ్ గా ఉంది కానీ నా సినిమాలకి దీనికి పోలిక లేదు అన్నారు. ముందు స్టొరీ లైన్ అనుకున్నప్పుడు ఆయనే చేస్తారేమో అని ఆయనకి చెప్పాము. అలాగే ఎక్కువగా కామెడీని జోడించి ఈ సినిమా చెయ్యాలని అనుకున్నాం. కానీ రాము గారికి ఏమో నాతో సీరియస్ గా ఉండే థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఈ సినిమా చెయ్యలేదు. రాముగారి సినిమాలో నటించాలనే కోరిక నాకూ ఉంది. త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నా..

ప్రశ్న) మొదటిసారిగా కామెడీ టచ్ ఉన్న పాత్రని ట్రై చేసారు.. కామెడీ చేయడం కష్టం అనిపించిందా.?

స) కామెడీ చేయడం చాలా కష్టం. అంత ఈజీ గా కామెడీ చెయ్యలేం. కచ్చితంగా ఓ టైమింగ్ ని ఫాలో అవ్వాలి. హాలీవుడ్ లో కామెడీ చాలా స్పీడ్ గా ఉంటుంది. అక్కడ ట్రాజిడీనే కామెడీ అంటారు. కానీ మన దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకొని చేసాను.

ప్రశ్న) కొత్త డైరెక్టర్ వంశీ కృష్ణ గురించి చెప్పండి.?

స) వంశీ కృష్ణ చాలా సినిమాలకు గౌతమ్ మీనన్ దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత మా దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా స్టొరీ లైన్ అనుకున్నప్పుడు రామూ గారు డైరెక్టర్ అనుకున్నాం. కథ మొత్తం డెవలప్ చేసింది వంశీనే, కానీ రామూ గారు నో అనడంతో తనకి అనుభవం ఉంది, కథని డెవలప్ చేసింది తనే అందుకే డైరెక్టర్ గా తనకే అవకాశం ఇచ్చాం.

ప్రశ్న) మీ తమ్ముడు మంచు మనోజ్ పెళ్లి విశేషాలు చెప్పండి.?

స) పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. నాన్నగారితో మనోజ్ పెళ్లిని ఏదన్నా ప్లేస్ లో లిమిటెడ్ క్రౌడ్ తో చేసుకుందాం అని అంటే, కుదరదు అంతా సాంప్రదాయ బద్దంగా జరగాలని ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. ప్రతి రోజూ ఇంట్లో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రశ్న) ఒక మదర్ గా విద్య నిర్వాణతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.?

స) చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎలా ఎక్స్ ప్రెసివ్ పర్సన్ ని.. అలాంటి నేను ఇప్పుడు నా కుమార్తెతో ఆడుకుంటున్నా, తను నన్ను టచ్ చేస్తున్నా ఆ ఫీలింగే వేరు. ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేను.

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాలు మరియు రియాలిటీ షోస్ గురించి చెప్పండి.?

స) ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్ తో పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తో నా తదుపరి సినిమా ఉంటుంది. ఇప్పటికే తను చెప్పిన స్టొరీ లైన్ నచ్చింది, జూన్ లో సెట్స్ పైకి వెళ్తుంది. ఇది కాకుండా నేను – మనోజ్ కలిసి జీ లో ఒక టాక్ షో ప్లాన్ చేస్తున్నాం. ఆ షోకి ‘మంచు లక్ష్మీతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే టైటిల్ పెట్టాము.

ప్రశ్న) చివరిగా మీ సినిమాతో పాటు బాలకృష్ణ ‘లయన్’ సినిమా కూడా వస్తోంది. ఎక్కడన్నా టెన్షన్ పడుతున్నారా.?

స) టెన్షన్ అనేది లేదండి. రెండు రెండు డిఫరెంట్ సినిమాలు. చెప్పాలంటే మా బాలయ్యతో కలిసి నేను సింహం మీద వస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నా లయన్ థియేటర్ పక్కనే నా సినిమా కూడా ఉండాలి. ఎందుకంటే లయన్ సినిమా హౌస్ ఫుల్ అయిపోతుంది, అక్కడ టికెట్స్ దొరకని వారు మా సినేమానికి వస్తారు అలాగే నా సినిమాకి వచ్చే ప్రేక్షకులు ఎలాను ఉంటారు. ఇలా అందరూ కలిసి నా సినిమాని కూడా హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు