‘ఇజం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!
Published on Oct 24, 2016 10:35 am IST

ism
పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో తెరకెక్కిన సినిమా గత శుక్రవారం (అక్టోబర్ 21న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మొదట్నుంచీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై భారీ ఎత్తున అంచనాలు ఉండడంతో మొదటిరోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇక టార్గెట్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగుండడంతో శని, ఆదివారాల్లోనూ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు.

ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా సుమారు 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్‌కి ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా చెప్పుకోవచ్చు. వచ్చే వారం దీపావళి ఉండడంతో అప్పటివరకూ సినిమా నిలబడితే లాంగ్‌రన్‌లో మంచి కలెక్షన్స్ రాబడుతుందనేది ట్రేడ్ అంచనా. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నిర్మించిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook