ఇంటర్వ్యూ : మధుర శ్రీధర్ – వంశీగారిని పూర్తిగా అర్థం చేసుకుంటే జర్నీ చాలా బాగుంటుంది !

ఇంటర్వ్యూ : మధుర శ్రీధర్ – వంశీగారిని పూర్తిగా అర్థం చేసుకుంటే జర్నీ చాలా బాగుంటుంది !

Published on May 30, 2017 4:32 PM IST


‘మాయ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనసు’ వంటి చిత్రాల్ని నిర్మించిన నిర్మాత మధుర శ్రీధర్ తాజాగా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ సినిమాను నిర్మించారు. సీనియర్ దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 2వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా మధుర శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ఈ సినిమా ఎందుకు చెయ్యాలనిపించింది ?
జ) అంటే ఇంతకు ముందు నేను చేసిన సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఉండేవి. కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్. బాహుబలి మినహా ఈ మధ్య తెలుగులో పెద్దగా సీక్వెల్స్ రాలేదు కనుక ఏదైనా సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయడం జరిగింది.

ప్ర) ఈ సినిమాకే సీక్వెల్ చేయాలని ఎందుకనిపించింది ?
జ) నాకు ఎప్పటి నుండో విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయాలని, అలాగే వంశీగారితో సినిమా చేయాలని ఉండేది. ఆ కారణాల వలనే ఈ సినిమాను చూజ్ చేసుకున్నాం. సినిమా అంతా లేడీస్ టైలర్ షూట్ చేసిన ఊరిలోనే చేశాం.

ప్ర) మణిశర్మ సంగీతం గురించి చెప్పండి ?
జ) మనం ఇప్పటి వరకు వంశీ, ఇళయరాజా కాంబినేషన్, వంశీ, చక్రి కాంబినేషన్ చూశాం. ఇప్పుడు వంశీ, మణిశర్మ కలయిక అదే స్థాయికి వెళుతుంది. ఐదు మెలోడీలను చాలా బాగా చేశారు. రీరికార్డింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన వర్క్ చూస్తే నిజంగా మాంత్రికుడే అనిపించింది.

ప్ర) ‘లేడీస్ టైలర్’ ఒక క్లాసిక్. దాన్ని ఎంత వరకు రీచ్ అయ్యారు ?
జ) అంటే ఈ సినిమాకు లేడీస్ టైలర్ కు అస్సలు సంబంధం లేదు. క్లాసిక్స్ చాలా వరకు అనుకోని తీసినవి కావు. అవన్నీ జరిగిపోయాయంతే. పనిగట్టుకుని క్లాసిక్ తీయాలంటే కష్టం. ఫ్యాషన్ డిజైనర్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సుందరం కొడుకు గోపాలం ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనేదే ఈ సినిమా.

ప్ర) సుమంత్ అశ్విన్ రాజేంద్ర ప్రసాద్ ను అందుకున్నారా ?
జ) అంటే నిజమైన తండ్రి కొడుకులు కూడా ఒకలా ఉండరు. ఇక్కడ కూడా అంతే వారిద్దరికీ సంబంధం ఉండదు. కానీ సుమంత్ అశ్విన్ మాత్రం ఇది రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన రోల్, వంశీగారు డైరెక్ట్ చేస్తున్నారు అని చాలా జాగ్రత్తగా చేశాడు. నేనైతే పూర్తిగా సంతృప్తి చెందాను.

ప్ర) వంశీగారితో జర్నీ ఎలా ఉంది ?
జ) వంశీగారు చాలా భిన్నమైన వ్యక్తి. ఆయన్ను లోతుగా అర్థం చేసుకుంటే ప్రయాణం హ్యాపీగా ఉంటుంది. చాలా మంది చాలా అంటుంటారు. కానీ అలాంటివేమీ ఉండవు. మనం కరెక్టుగా ఉంటే ఎదుటివాళ్ళు కూడా కరెక్టుగా ఉంటారు.

ప్ర) హీరోయిన్లు ఏడ్చారని విన్నాం ?
జ) అంటే కావాల్సింది రాబట్టుకోవడానికి కొంచెం కష్టపెడతారు. హీరో హీరోయిన్ల సీన్ ను చెట్టు మీద తీస్తానంటారు. ఎక్కిన తర్వాత చివర్లో హీరో అక్కడి నుండి దూకితే ఎలా ఉంటుంది అనుకుంటారు. అలానే చేయమని చెప్తారు. అలా సరదాగా ఉంటుంది ఆయనతో వర్క్.

ప్ర) ఇందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ఇందులో హీరోకి మన్మథ రేఖ ఉంటుంది. అది కోటి మందిలో ఒకరికి ఉంటుంది. అంటే ఆ రేఖ ఉన్నవాళ్లు అమ్మాయిలతో కాసేపు మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. అలాగే హీరోకి సిటీకొచ్చి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఆశ ఉంటుంది.

ప్ర) సెన్సార్ సమస్యలేమీ రాలేదా ?
జ) అస్సలు రాలేదు. కానీసం ఒక సింగిల్ కట్ కూడా పడలేదు. ఏవో రెండు డైలాగ్స్ తప్ప ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు.

ప్ర) ఈ కథలో మీ ప్రమేయమేమన్నా ఉందా ?
జ) హీరోకి మన్మథ రేఖ ఉండటం అనేది నా ఆలోచనే. ముందుగా ఇది తనికెళ్ల భరణి కథ. మొదట రాజ్ తరుణ్ తో సినిమా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. చివరికి ఇలా వర్కవుట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు