‘కథనం’ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్..!

‘కథనం’ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్..!

Published on May 23, 2015 8:00 AM IST

Kathanam
ఏ భాషలో రూపొందే సినిమా అయినా ప్రస్తుతం ప్రేక్షకులంతా కోరుకునేది కొత్తదనమే అనడంలో అతిశయోక్తి లేదు. కొత్తదనమున్న సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొనే కొత్త సినిమాలు రూపొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కోవలో సరికొత్త కథగా తెరకెక్కిందని చెప్పబడుతున్న ‘కథనం’ అనే సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. మాంత్రిక్స్ మీడియా వర్క్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి కిరణ్ ముక్కాముల దర్శక నిర్మాత.

ప్లే ఆఫ్ గాడ్ (దేవుడి ఆట) అన్న ఉపశీర్షికతో తెరకెక్కుతోన్న ‘కథనం’ సినిమా ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ సినీ నిర్మాత సురేష్ కొండేటి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రంజిత్, అర్చనలు ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు