టీజర్ తోనే రికార్డులు మొదలుపెట్టిన మెగాస్టార్ !

టీజర్ తోనే రికార్డులు మొదలుపెట్టిన మెగాస్టార్ !

Published on Dec 9, 2016 12:02 PM IST

khaidi-150-jpg
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ టీజర్ నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదలై అన్ని సోషల్ నెట్వర్క్ లలో ప్రభంజనం సృష్టించింది. విడుదలైన కొద్దిసేపటికే నేషనల్ ట్రెండై కేవలం మూడు గంటల్లోనే 1 మిలియన్ మార్క్ దాటేసింది. టీజర్లో చిరు లుక్ చాలా స్టైలిష్ గా, యంగ్ గా ఉండటం వాళ్ళు ఊహించిన దానికంటే టీజర్ ఎక్కువగానే సంతృప్తి నివ్వడం వలన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

24 గంటలు కూడా గడవక ముందే ఈ టీజర్ 2 మిలియన్ల వ్యూస్ దాటిపోయి కొత్త రికార్డులు సృష్టోస్తోంది. విడుదలకు ముందే మెగాస్టార్ ఇలా రికార్డుల మోత మోగిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ ‘కత్తి’ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్ర కథ మొత్తం రైతుల సమస్యల చుట్టూ తిరుగుతుంటుంది. వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు