వైజాగ్‌కు షిఫ్టైన వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’

వైజాగ్‌కు షిఫ్టైన వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’

Published on Aug 3, 2015 9:10 PM IST

Killing-Veerappn
ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో వివాదాస్పద నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే! రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్’ రూపొందుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని అటావీ ప్రాంతంలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన యూనిట్, తాజాగా వైజాగ్‌కు షిఫ్ట్ అయింది.

నేటినుంచి వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తున్నారు. ఇక వీరప్పన్‌గా రామ్ గోపాల్ వర్మ, సందీప్ భరద్వాజ్ అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేయడం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఈ సినిమాతో వర్మ మళ్ళీ తన మార్క్‌ ఏంటనేది చూపించనున్నారని తెలుస్తోంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు