‘ప్రాజెక్ట్ హీల్ బాక్స్’ పేరుతో చిన్నపిల్లల కోసం కృష్ణుడు..!

‘ప్రాజెక్ట్ హీల్ బాక్స్’ పేరుతో చిన్నపిల్లల కోసం కృష్ణుడు..!

Published on Aug 28, 2015 9:21 PM IST

krisunudu
కృష్ణుడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడమే కాక, ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ లాంటి పలు మంచి సినిమాల్లో హీరోగా నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అందరి మంచి కోరే తరహా పాత్రలు చాలా చేసిన కృష్ణుడు, నిజ జీవితంలోనూ తనది అలాంటి మనస్థత్వమే అని నిరూపించుకున్నారు. స్కూల్ పిల్లల కోసం కృష్ణుడు ‘ప్రాజెక్ట్ హీల్ బాక్స్’ పేరుతో ఓ మంచి ఆలోచనతో వచ్చారు.

తనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండేదని, ఆ క్రమంలోనే ఇప్పటికీ స్కూల్లలో ఫస్ట్ ఎయిడ్‌కి సంబంధించిన బాక్స్‌లు లేవడం గుర్తించానని తెలుపుతూ కృష్ణుడు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడంతో స్కూలల్లో తగిలే చిన్న చిన్న దెబ్బలు కూడా పిల్లలకు ఆ తర్వాత చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని, అందుకే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 39000 స్కూల్లకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించేందుకు కృషి చేస్తున్నామని కృష్ణుడు తెలిపారు. దాతలెవరైనా http://www.healbox.org సైట్‌లో తమ ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకొని విరాళాలు ఇవ్వవచ్చని కృష్ణుడు ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు