‘మహానటి’ మొదలైంది !
Published on May 29, 2017 12:17 pm IST


‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో విమర్శకుల ప్రసంశలు సైతం అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ పేరుతో అలనాటి గొప్ప నటి సావిత్రిగారి జీవితాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ అయి చాన్నాళ్లు కావొస్తున్నా స్క్రిప్ట్, కాస్టింగ్ పనులకు ఎక్కువ టైమ్ తీసుకున్న ఈ చిత్రం ఈరోజే రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభోత్సవం జరుపుకుంది. చిత్ర షూటింగ్ కూడా ఈరోజే మొదలుకానుంది.

సావిత్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఈ చిత్రాన్ని అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందించనున్నారు.

 

Like us on Facebook