మహేష్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం.

మహేష్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం.

Published on Aug 9, 2020 5:04 PM IST

నేడు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఏటా మహేష్ ఫాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపేవారు, ఐతే ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహేష్ భౌతిక వేడుకలు దూరంగా ఉండాలని, గుంపులుగా చేరవద్దని చెప్పడం జరిగింది. దీనితో సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డే యాష్ భారీగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇక మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మిలియన్స్ లో ఈ బర్త్ డే యాష్ ట్యాగ్ ని ట్వీట్ చేయడం జరిగింది. మరో ప్రక్క మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకోవడంతో పాటు, భారీగా ట్రెండ్ అయ్యింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు