రొమేనియాలో మహేష్, రకుల్ రొమాన్స్ !

రొమేనియాలో మహేష్, రకుల్ రొమాన్స్ !

Published on Jul 26, 2017 11:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ ని మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 న విడుదల చేయనున్నారు.

కాగా ఈ చిత్రంలో రొమాంటిక్ సాంగ్ ని మహేష్ మరియు రకుల్ ల మధ్య దర్శకుడు మురుగదాస్ ఆగష్టు 2 నుంచి 8 మధ్య చిత్రీకరించనున్నారు. యూరప్ లోని రొమేనియాలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 27 న స్పైడర్ ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు