నాగ చైతన్య కోసం రెండు భారీ భవంతులు !

నాగ చైతన్య కోసం రెండు భారీ భవంతులు !

Published on Feb 28, 2017 7:27 PM IST


గతేడాది ఆఖరులో ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు మంచి చిత్రాలతో తన స్టార్ స్టేటస్ ను వేరే స్థాయికి మార్చుకున్న యంగ్ హీరో నాగ చైతన్య ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం చైతన్యకు నాగార్జునకు ‘నిన్నే పెళ్లాడతా’ అందించిన విజయం లాంటి సక్సెస్ ను ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం రెండు భారీ భవంతుల సెట్టింగ్స్ వేశారట.

ఈ ఒక్కో భవంతి ఖరీదు రూ. 60 లక్షల పైమాటే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాహి సురేష్ ఈ సెట్టింగ్స్ ను చాలా గొప్పగా వేశారని, సినిమాలో ఇవి గ్రాండ్ గా కనిపిస్తాయని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తుండగా చైతన్య సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు