షూటింగ్ పూర్తిచేసుకున్న ‘నా పేరు సూర్య’ !

షూటింగ్ పూర్తిచేసుకున్న ‘నా పేరు సూర్య’ !

Published on Apr 19, 2018 8:53 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. నిన్న మొన్నటి వరకు చివరి దశ షూటింగ్ పనుల్లో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు ముగిసింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతున్నారు చిత్ర యూనిట్. బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రం హెవీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం.

రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇప్పటికే సినిమా నుండి మూడు పాటలు విడుదలకాగా పూర్తి ఆడియోను 22న మిలిట్రీ మాధవరంలో విడుదలచేసి ప్రీ రిలీజ్ వేడుకను 29న నిర్వహించనున్నారు. మే 4వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్, బన్నీ వాసులు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు