కాస్ట్లీ కార్ కొన్న ఇస్మార్ట్ హీరోయిన్

కాస్ట్లీ కార్ కొన్న ఇస్మార్ట్ హీరోయిన్

Published on Oct 14, 2019 11:08 PM IST

శివ్ రాజ్ కుమార్ హీరోగా 2015లో వచ్చిన కన్నడ చిత్రం వజ్రకాయ తోవెండి తెరకు పరిచయమైన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువంటే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. డైనమిక్ డైరెక్టర్ పూరి చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ సరసన నటించే అవకాశం దక్కించుకొని, ఇస్మార్ హిట్ అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తెలంగాణా పోరీ గా నభా నాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టింది.

కాగా ఈ భామ కొత్తగా రెడ్ బెంజ్ కారు కొన్నారు. ఇక తన కొత్త కారు పక్కన సూపర్ ఫోజిలిస్తూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత నభాకు టాలీవుడ్ లో మంచిగానే అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా మూవీలో నటిస్తున్న ఈమె, తాజాగా ధరమ్ తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు