త్వరలో మొదలుకానున్న నాగ చైతన్య సినిమా షూటింగ్ !

త్వరలో మొదలుకానున్న నాగ చైతన్య సినిమా షూటింగ్ !

Published on Jan 17, 2018 8:00 PM IST


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం 30 శాతానికి పైగానే చిత్రీకరణను ముగించుకుంది. ఇదిలా ఉండగానే చైతు మారుతి దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమాను మొదలుపెట్టనున్నారు.

జనవరి 19నుండి రెగ్యులర్ షూట్ ఆరంభంకానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్ర కథను నాగ చైతన్యను దృష్టిలో పెట్టుకునే రాశానని చెప్పిన మారుతి ఇదొక ప్రేమ కథగా ఉండబోతోందని గతంలోనే అన్నారు. గతేడాది మారుతి డైరెక్ట్ చేసిన ‘మహానుభావుడు’ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు